ప్రేమ, పెళ్లి ఈ రెండు బంధాలు ఎంతో గొప్పవి. రెండు మనుషులను, మనసులను కలిపే అద్భుతమైన శక్తి వీటికి ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు జీవితం చాలా కొత్తగా ఉంటుంది. ప్రేమించిన మనిషి ఏం చేసినా మనకు అంతే బాగా నచ్చుతుంది.వారి కోసం ఏదైనా చేసేయడానికి ముందుకు వస్తాం. నిత్యం వారితోనే సరదాగా గడపాలని కోరుకుంటాం.
ఇంతకవరకూ బాగానే ఉంది. కానీ.. ఒక్కసారి ఆ ప్రేమ బంధంలోకి కోపం, ధ్వేషం, అనుమానం, అసహ్యానికి చోటు దొరికితే... ఇక ఆ బంధానికి దూరం కావడమే మంచిదని భావిస్తుంటారు. అయితే... ఒక బంధం చెడిపోతే... చాలా మంది మళ్లీ అలాంటి బంధానికి దగ్గరౌతున్నారట.
ప్రేమ సంతోషాన్ని పంచితే బ్రేకప్ బాధను పరిచయం చేస్తుంది. ఇక ఇలాంటి వ్యక్తితో నాకు పడదు అనిపించేలా చేస్తుంది. అతని లక్షణాలు, వ్యక్తిత్వం అప్పుడిక చేదుగా అనిపిస్తాయి. వీటికంటే భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న మనుషుల కోసం వెతుకుతారు. అయితే మళ్లీ సేమ్ లక్షణాలున్న వ్యక్తితోనే ప్రేమలో పడతారట.
ఒక రిలేషన్ షిప్ ముగిసిపోయి..కొత్త రిలేషన్ షిప్ ప్రారంభించేముందు అనుకున్నవన్నీ తలకిందులయ్యి మళ్లీ మాజీ ప్రియుడిలాంటి లక్షణాలున్న వ్యక్తితోనే ప్రేమలో పడతారని ఓ రీసెర్చ్ లో తేలింది. దీనికి కారణం అలవాటైన ధోరణి కావడమేనని అంటున్నారు.
అలాంటి లక్షణాలున్నవ్యక్తితో మీరు కంపర్టబుల్ గా ఉండడం, అలాంటి వారిగురించిన అవగాహన ఉండడం..వారు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు. ఎలా ఉంటారని తెలిసి ఉండడమేనని రీసెర్చర్స్ చెబుతున్నారు.
ఏదేమైనా కొత్తవ్యక్తితో డేటింగ్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మీ మాజీప్రియుడితో ఉన్న కంపర్ట్ జోన్ నుండి బైటికి వచ్చినట్టుగా భావిస్తారట. ప్రతి రిలేషన్ షిప్ లోనూ తమ భాగస్వామి స్వభావాన్ని బట్టి వారితో వ్యవహరించడంలో స్ట్రాటజీలు రెండోవాళ్లు నేర్చుకుంటారని చెబుతున్నారు.
మీ కొత్త పార్టనర్ పర్సనాలిటీ మీ మాజీ ప్రియుడి పర్సనాలిటీతో కలుస్తున్నట్టైతే అది ఇంకా మంచిదంటున్నారు. పాత రిలేషన్ లో మీరు నేర్చుకున్న లేదా అనుభవంమీద తెలుసుకున్న అంశాలు కొత్త బంధాన్ని బలపరచడానికి బాగా ఉపయోగపడతాయి.
ఒక రిలేషన్ షిప్ తరువాత మరొకటి రిలేషన్ షిప్ మారుతుంది కానీ సమస్యలు మారడం లేదు అంటే ఒకసారి ఆలోచించాలి. ఒకేలాంటి వ్యక్తిత్వంతో ఉన్న వ్యక్తులతో వచ్చే ఒకేలాంటి సమస్యలు. అలాంటి వ్యక్తిత్వానికే మీరు ఆకర్షితులవ్వడం..వ్యక్తిత్వంలో తేడాలు లేకపోవడమే మీ సమస్యలకు కారణమని గుర్తించాలి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సారి డేటింగ్ చేసేముందు కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మీ రిలేషన్ షిప్ లో సమస్యలు దూరం కావాలంటే పదే పదే అదే ప్రేమలో పడకుండా కాస్త విలక్షణ లక్షణాలున్న వ్యక్తలును ఎంచుకోండి. సమస్యలకు కాస్త దూరంగా ఉండండి.