పీరియడ్స్ వేళ కలయిక.. డాక్టర్ల సలహా ఇదే..

First Published | Oct 4, 2019, 11:41 AM IST

 హార్మోన్స్ కేవలం భావ ప్రాప్తి కలిగినప్పుడు మాత్రమే విడుదలౌతాయి. అవి మనసుకి ప్రశాంతంగా కూడా అనిపిస్తాయి. అందుకే ఆ సమయంలోనూ శృంగారంలోనూ పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మహిళల్లో పీరియడ్స్( రుతుక్రమం) రావడం అనేది సర్వసాధారణం. అది నెలనెలా వస్తూనే ఉంటుంది. అయితే.. ఈ పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా సెక్స్ విషయానికి వచ్చే సరికి.. మరిన్ని అపోహలు పెరిగిపోతాయి.
undefined
అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా లేదా..? అనేది చాలా మంది సందేహం. దీని వల్ల ఎవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే భయం కూడా చాలా మందిలో ఉంది. అయితే.. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. భార్యభర్తలకు ఇష్టమైతే.. పీరియడ్స్ సమయంలో కూడా సెక్స్ చేయవచ్చని సూచిస్తున్నారు.
undefined

Latest Videos


వ్యక్తిగత శుభ్రత పాటించేవరకూ పీరిడయ్స్ సమయంలోనూ శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో పాల్గొన్న సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనినే బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. వీటితోపాటు ఎండార్ఫిన్ కూడా విడుదల అవుతుంది. ఈ హార్మోన్ల కారణంగా పీరియడ్స్ లో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
undefined
ఇలాంటి హార్మోన్స్ కేవలం భావ ప్రాప్తి కలిగినప్పుడు మాత్రమే విడుదలౌతాయి. అవి మనసుకి ప్రశాంతంగా కూడా అనిపిస్తాయి. అందుకే ఆ సమయంలోనూ శృంగారంలోనూ పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
అయితే... అది స్త్రీ ఇష్టాన్ని బట్టి మాత్రమే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో దానికి ఆమె అంగీకరిస్తే... అప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఆనందంగా గడపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
అంతేకాదు.. పీరియడ్స్ సమయంలో సెక్స్ విషయంలో అమ్మాయిల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయంపై కూడా కొందరు నిపుణులు సర్వే జరిపారు. కొందరి మహిళలపై చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
undefined
వారి సర్వే ప్రకారం.. 70శాతం మంది మహిళలు నెలసరి సమయంలో సెక్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడయ్యింది. కొందరైతే.. ఆ సమయంలో కూడా సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలిగామని చెబుతున్నారు.
undefined
మరికొందరు తమ నెలసరిలో వచ్చే నొప్పిని మర్చిపోగలుగుతున్నామని చెప్పడం విశేషం. ఇంకొందరేమో.. తమకు ఆసక్తి ఉన్నా,... తమ భర్తలకు ఆ సమయంలో చేయడం ఇష్టం ఉండటం లేదని చెబుతున్నారు.  చాలా కొద్ది మంది మాత్రమే ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం తమకు ఇష్టం ఉండదని చెబుతున్నారు.
undefined
click me!