పెళ్లైన పురుషులకు మాత్రమే.. వీళ్లే ఎక్కువ రోజులు ఎందుకు బతుకుతారు?

First Published | Apr 6, 2024, 3:47 PM IST

పెళ్లి తర్వాత పొట్ట పెరుగుతుందన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇదే కాదు పెళ్లి తర్వాత పురుషుల ఆయుష్షు కూడా పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. దీనికి కారణాలేంటో తెలుసా? 

పెళ్లి చేసుకోవడమేనిది ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద నిర్ణయం. పెళ్లి తర్వాత ఆడ, మగవారి శరీరంలో, జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అంటే పెళ్లి తర్వాత మగవారికి, ఆడవారికి ఖచ్చితంగా పొట్ట వస్తుంది.ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన తర్వాత పురుషులు ఎక్కువ కాలం బతుకుతారని సైన్స్ చెబుతోంది. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం పదండి. 
 

సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెబుతోంది?

జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం..  పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందని పేర్కొంది. విడాకులు తీసుకున్న, బ్యాచిలర్ అబ్బాయిలలో ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని వెల్లడించింది. 


ఎంతమందిపై పరిశోధనలు చేశారు?

ఆసియాలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 6,23,140 మందిపై ఈ పరిశోధనలు జరిగాయి. వారితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఈ అధ్యయనం చేశారు. జపాన్ పరిశోధకులు ఈ పరిశోధనను 15 సంవత్సరాలలో పూర్తి చేశారు. పెళ్లైన జంటలు ప్రమాదాలు, గాయాలు లేదా గుండె జబ్బులతో మరణించే అవకాశం 20 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది.
 

ఆర్థిక భారమే కారణం

బ్యాచిలర్ అబ్బాయిలు ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోతుంటారు. ఈ విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. డబ్బు సంపాదనలో పడి బ్యాచిలర్స్ తమపై లేదా వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపలేరు. దీనివల్లే వీరి ఆయుష్షు తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

రిస్క్ లేకపోవడం

పెళ్లై వారు తమ ప్రాణాలను ఎక్కువ రిస్క్ లో పెట్టరు. అంటే మందును ఎక్కువగా తాగరు. అలాగే మాదకద్రవ్యాలను తీసుకోరు. వీరికి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగవు. దీనివల్ల  వీరు మరణించే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
 

భార్య 

పెళ్లి తర్వాత పురుషులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి భార్య ఎప్పుడూ అండగా ఉంటుంది. కష్టమొచ్చినా, దు:ఖమొచ్చినా ఓదారుస్తుంది. అలాగే భర్తల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అందుకే పురుషులు ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. 

ఒత్తిడి

ఆసియా కుటుంబాల్లోని అమ్మాయిలు పెళ్లి తర్వాత ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారట. అలాగే అవసరానికి మించి ఇంటి పనులు చేయాల్సి వస్తోందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ ఒత్తిడి వల్ల వారి వయసు పెరిగిపోతుంది. 
 

Latest Videos

click me!