శృంగారం విషయంలో అమ్మాయిలు ఇలానే ఆలోచిస్తారట

First Published | Apr 1, 2020, 2:30 PM IST

ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి అంటే... రోజంతా అదే ఆలోచన ఉన్నట్లు. ఇదేమీ నిజం కాదని పెద్ద ఎత్తున చర్చలు పెట్టి మరీ ఖండించారు. దీంతో.. మరో సంస్థ దీనిపై సర్వే  చేపట్టగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.అమెరికన్ యువతీ, యువకుల మీద జరిగిన ఒక అధ్యయనం ఆసక్తిని రేపుతోంది. 

శృంగారం గురించి మాట్లాడటానికే చాలా మంది ఇష్టపడరు. అదో పెద్ద బూతు పదంలా చూస్తారు. అయితే.. నిజానికి అదేం అంత పెద్ద బూతు పదం కాదు.. అన్ని పనులు ఎలానో శృంగారం కూడా అలానే.. దీన్ని ఎంజాయ్ చేయాలి. నిజానికి దీని గురించి ప్రజలు ఎంత ఎక్కువ సమాచారం తెలుసుకుంటే అంత మంచిదని సూచిస్తున్నారు.
పురుషలకు సెక్సీ థాట్స్ ఎక్కువ అనేది అందరి అభిప్రాయం. వాళ్లు ఎక్కువ శాతం దాని గురించే ఆలోచిస్తూ ఉంటారని అందరూ భావిస్తుంటారు. ఒకానొక సర్వేలో... పురుషులు ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి శృంగారం గురించి ఆలోచిస్తారని కూడా తేలింది. అయితే... ఈ సర్వేపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి అంటే... రోజంతా అదే ఆలోచన ఉన్నట్లు. ఇదేమీ నిజం కాదని పెద్ద ఎత్తున చర్చలు పెట్టి మరీ ఖండించారు. దీంతో.. మరో సంస్థ దీనిపై సర్వే  చేపట్టగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమెరికన్ యువతీ, యువకుల మీద జరిగిన ఒక అధ్యయనం ఆసక్తిని రేపుతోంది.
18 నుంచి 25 యేళ్ల వయసు మధ్య ఉన్న కొంతమంది యువతీయువకులను ఎంచుకుని.. వారిని సర్వేలో భాగం చేస్తూ.. ఈ అధ్యయనం చేశారట. అధ్యయనకర్తలు వాళ్లకు ఏం చెప్పారంటే.. ఒక రోజులో మీకు ఎన్ని సార్లు సెక్స్ గురించి ఆలోచనలు వస్తాయో నోట్ చేయమన్నారు. క్రమం తప్పకుండా లిస్ట్ చేయాలని, ఇలా వారం రోజుల పాటు చేయాలని అధ్యయనకర్తలు సూచించారు.
మరి ఈ అధ్యయనంలో పాల్గొన్న ఔత్సాహికులు చెప్పిన దాని ప్రకారం.. సగటున అమ్మాయిలు, అబ్బాయిలు ఎన్ని సార్లు సెక్స్ గురించిన ఆలోచనలు చేస్తారో ఒక అంచనాకు వచ్చారు అధ్యయనకర్తలు.
ఈ స్టడీ ప్రకారం.. మగవాళ్లు రోజుకు సగటున 34 సార్లు సెక్స్ గురించి ఆలోచిస్తారు. అదే అమ్మాయిల విషయానికి వస్తే వాళ్లను ఒక రోజులో సగటును 18 సార్లు సెక్సీ థాట్స్ పలకరిస్తాయని తేలింది!
ఇక ఎండా కాలంలో అసలు ఎవరూ కూడా సెక్స్‌ని ఎంజాయ్ చేయట్లేదని పరిశోధనలు చెబుతున్నాయి. పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల అసలు ఆ పని అంటే ఏదో తూతూ కార్యంగా చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతున్నాయి.
ఇక ఇదే విషయంలో మహిళల తీరు కూడా మారుతుందట. ఈ విషయాన్ని వారు రోజుకో విధంగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు పరిశోధకులు…చాలా మంది భార్యభర్తలు ఆ పని ఏదో చేయాలంటే చేయాలని చూస్తున్నారే తప్పా ఇష్టంగా చేయట్లేదు..
నేటి మహిళల్లో చాలా మంది తమ భర్తలతో శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారని ఇటీవలి కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు..
భార్య భర్తలు సెక్స్ అంటే కలయిక మాత్రమే కాదని ప్రేమ, అభిమానంతో కూడినప్పుడే ఇది బాగుంటుందని అయితే, నేటి బిజీ లైఫ్‌లో భార్యాభర్తల మధ్య కాసేపు మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం వంటి ప్రేమకి సంబంధించినవి ఏమీ లేవు.. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు.
దీంతో మహిళలు సెక్స్ విషయంలో విసిగిపోయారని.. తమతో ప్రేమగా, అప్యాయంగా ఉండట్లేదని విసుగు చెందుతున్నారని తేలింది. ఈ కారణంగానే ఒకరిపై ఒకరికి ఇష్టం తగ్గడం అసహనం, అయిష్టం పెరగడం.. ఇది చివరికీ విడిపోవడం, అక్రమసంబంధాలకు దారి తీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ విషయంలో పురుష పుంగవులు మేల్కోవాలని లేకపోతే సంసారంలో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అదే విధంగా మగవారు ఎక్కువగా మహిళలు బాడీ ఫిట్‌గా ఉండడాన్ని, డబ్బు ఉండడాన్ని ఇష్టపడతారని మగవారు భావిస్తారని చెబుతారు. కానీ, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెబుతున్నారు నిపుణులు.
కానీ మహిళలకి శరీరం ముఖ్యం కాదని.. ప్రేమతో తమ మనసుని గెలిస్తే వారంతట వారే మగవారికే దాసోహం అంటారని చెబుతున్నారు. అయితే ఏదో నాటకపు ప్రేమలు కాకుండా చూపించే ప్రేమలోనూ నిజాయితీ ఉండాలని చెబుతున్నారు నిపుణులు.
ఆడవారి మనసుని గెలవడానికి ప్రేమకు మించిన మరో అస్త్రం లేదని చెబుతున్నారు.

Latest Videos

click me!