అబ్బాయిల్లో.. అమ్మాయిలు వీటినే గమనిస్తారు..

First Published | Dec 20, 2023, 11:31 AM IST

డేటింగ్ లో ఒకరిగురించి ఒకరు తెలుసుకోవడం చాలా సహజం. అయితే ఫస్ట్ డేటింగ్ లో అమ్మాయిలు..  అబ్బాయిల్లో కొన్నింటిని బాగా గమనిస్తారట. దీనితోనే వారు అబ్బాయిలపై ఒక అంచనాకు వస్తారట.
 

ఈ ఆధునిక  కాలంలో డేటింగ్ చాలా కామన్ విషయంగా మారిపోయింది. ఫస్ట్ మీట్ యే నెక్ట్స్ వీరు మాట్లాడుకోవాలా? వద్దా? అనేది డిసైజ్ చేస్తుంది. ఈ సమయంలో అమ్మాయిలు అబ్బాయిల్లో కొన్ని గమనిస్తే.. అబ్బాయిలు.. అమ్మాయిల్లో కొన్ని విషయాలను గనమిస్తారట. అవేంటో మనం ఓ లుక్కేద్దాం పదండి. 
 

ఫస్ట్ మీట్

ఒక అమ్మాయి .. అబ్బాయిని మొదటిసారి కలిసినప్పుడు వారిలో ఎన్నో విషయాలను గమనిస్తుంది. దీంతో వారు ఎన్నో అంచనాలు వేస్తారు. అయితే ఈ అంచనాలు కేవలం శారీరక రూపానికి మాత్రమే కాదు.. వారి వ్యక్తిత్వం, ప్రవర్తన, మాట్లాడే సామర్థ్యలపై ఉంటాయి. 


లుక్

జస్ట్ డేటింగ్ కోసమే కాదు.. అందరిలో మనం బెస్ట్ గా కనిపించడానికి మన లుక్స్ చాలా ముఖ్యం. సాధారణంగా ప్రేమకు రూపం ముఖ్యం కాదని చెప్తుంటారు. కానీ కొన్ని చోట్ల అవే చాలా ముఖ్యమైనవి. మంచి డ్రెస్సింగ్, వ్యక్తిగత పరిశుభ్రతను అబ్బాయిల్లో అమ్మాయిలు గమనిస్తారు. ఇవి ఆ అబ్బాయిపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి. మంచి డ్రెస్సింగ్ స్టైల్ మొదటి కలయికకు సానుకూలంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.

బాడీ లాంగ్వేజ్

ప్రేమలో నోటి మాటల కంటే ముందే శరీరాలు మాట్లాడుకుంటాయి. అంటే ఆడవారు ఎక్కువగా అబ్బాయిల చూపులను గమనిస్తారు. పురుషుడి భంగిమ, హావభావాలు, కంటి సంపర్కం వంటివన్న మాట. బాడీ లాంగ్వేజ్ ద్వారా వ్యక్తమయ్యే ఆత్మవిశ్వాసం, గౌరవప్రదమైన ప్రవర్తన మహిళల మనస్సుపై ఎంతో ప్రభావం చూపుతాయి.

కమ్యూనికేషన్

డేటింగ్ లో మొదటి దశ కమ్యూనికేషన్. ఒక వ్యక్తి ఎలా కమ్యూనికేట్ చేస్తాడనే దానిమీదే ఆ రిలేషన్ షిప్ సాగాలా? వద్దా? అన్నది ఆధారపడి ఉంటుంది. అతని మాట తీరు, ఎలా ఆలోచిస్తున్నాడు వంటి విధానమే వారి స్నేహాన్ని తదుపరి స్థాయికి తీసుకెళుతుంది. ఆడవారు చెప్పేది సరిగ్గా వినడం, దానిక గురించి తెలుసుకవడానికి ఇంట్రెస్ట్ చూపడం, మంచి వాయిస్ వంటి అంశాలు సానుకూల భావోద్వేగాలకు దారితీస్తాయి. అందుకే అబ్బాయిల్లో అమ్మాయిలు వీటిని ఎక్కువగా గమనిస్తారు.
 

హాస్యం, తెలివితేటలు

స్నేహమైనా, బంధుత్వమైనా.. ఇద్దరిమధ్య మంచి సంబంధం ఏర్పడాలంటే హాస్య చతురత. తెలివితేటలు పక్కాగా ఉండాల్సిందేనంటారు కొంతమంది. హాస్యం, తేలికపాటి వ్యంగ్యం చేసే సామర్థ్యం ఉన్న పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.

తెలివి

అర్థం చేసుకునే మనస్తత్వం, కష్టసమయాల్లో ప్రేమను వ్యక్తపరచడం వంటివి మహిళలు పురుషుల నుంచి ఎక్కువగా ఆశించే లేదా అన్వేషించే కొన్ని విషయాలు. సమస్యలు ఎక్కువగా ఉన్న భావోద్వేగ పరిస్థితులను అతను ఎలా నావిగేట్ చేస్తాడనే దానిపై మహిళలకు ఒక అంచనా ఉంటుంది.
 

Latest Videos

click me!