కండోమ్స్ వాడే వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

First Published Dec 19, 2023, 2:54 PM IST

సురక్షితమైన కలయికలో పాల్గొనాలంటే కండోమ్లను ఖచ్చితంగా ఉపయోగించాలని నిపుణులు సలహానిస్తారు. నిజానికి చాలా మందికి కండోమ్ లను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియదు. దీనివల్ల అవాంఛిత గర్బం, లైంగిక సమస్యల బారిన పడుతుంటారు. 
 

condoms

కండోమ్లు జనన నియంత్రణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి ఇందుకే ఉపయోగిస్తారని చాలా మంది అనుకుంటారు. కొంతమంది వీటిని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే.. మరికొంతమంది వీటికి దూరంగా ఉంటారు. కానీ కలయికలో వీటిని ఉపయోగిస్తేనే సేఫ్. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది.  


కండోమ్ అంటే ఏమిటి?

కండోమ్లు ఒక ప్రసిద్ధ గర్భనిరోధక ఉత్పత్తి. ఇది వీర్యం గుడ్డును కలవకుండా నిరోధిస్తుంది. దీంతో గర్బందాల్చే అవకాశం ఉండదు. ఇవి రబ్బరు, పాలియురేథేన్ లేదా పాలిసోప్రిన్ వంటి వివిధ పదార్థాలతో తయారవుతాయి. అలాగే లైంగిక సంక్రమణ అంటువ్యాధులు, వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. మరి వీటిని యూజ్ చేసేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

 

Condom Usage

కండోమ్స్ కు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న ముచ్చటను ఎప్పుడైనా గమనించారా? ఆహార పదార్థాల మాదిరిగానే కండోమ్స్ కు కూడా ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. అందుకే వీటిని కొనేటప్పుడు వాటి డేట్ లను చెక్ చేయండి. కానీ చాలా మంది వీటి డేట్ లను అస్సలు చెక్ చేయరు. కానీ దీనివల్ల అవి చిరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇవి సంక్రమణకు కారణమవుతాయి. అంతేకాకుండా గడువు ముగిసిన కండోమ్లు పేలిపోయే అవకాశం ఉంది. అలాగే లైంగిక సంక్రమణ వ్యాధులను నివారించే సామర్థ్యం, గర్భధారణను బాగా తగ్గిస్తుంది. అందుకే కండోమ్ ను కొనేటప్పుడు వాటి ఎక్స్ పైరీ డేట్ లను చెక్ చేయండి. 
 

Couple with Condom

ఫ్లేవర్డ్ కండోమ్లు 

ఫ్లేవర్డ్ కండోమ్లు కూడా సాధారణ కండోమ్లే. కానీ స్ట్రాబెర్రీ, చాక్లెట్ వంటి మరెన్నో మీకు ఇష్టమైన రుచులతో ఇవి లభిస్తాయి. వీటిని ఓరల్ సెక్స్ కోసం ఉపయోగిస్తారు. కానీ కొంతమంది యోని కలయికలో కూడా వీటిని ఉపయోగిస్తారు. కానీ వీటిని దీని కోసం ఉపయోగించడం మంచిదికాదు. ఎందుకంటే ఇవి రసాయనికంగా సంశ్లేషణ చేయబడతాయి. వీటిని ఉపయోగించడం వల్ల యోని చికాకు, దురద లేదా సంక్రమణ వంటి సమస్యలు వస్తాయి. 

కండోమ్లను ఎక్కడ నిల్వ చేస్తారు

కండోమ్లను ఎప్పుడూ కూడా చల్లని, పొడి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. వీటిని మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే ప్లేస్ లో ఉంచకూడదు. అందుకే వీటిని సూర్యరశ్మి, వేడి, తేమ ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. వీటిని పొడి, చల్లని ప్రదేశంలోనరే నిల్వ చేయాలి. కండోమ్లను మీ బ్యాగ్ లేదా పర్సులో ఉంచడం వల్ల లేటెక్స్ చెడిపోతుంది. అలాగే ల్యూబ్ కూడా చెడిపోతుంది. ఇది అంటువ్యాధులు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

condom

రబ్బరు కండోమ్లు 

మీరు ల్యూబ్, కండోమ్లను కలిపి ఉపయోగించొచ్చు. ఇది ఘర్షణను తగ్గిస్తుంది. అలాగే ఉద్వేగాన్ని పెంచడానికి, లైంగిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. నీటి ఆధారిత లేదా సిలికాన్ ఆధారిత ల్యూబ్ ను, లేటెక్స్ కండోమ్లతో ఉపయోగించడం మంచిది. లేటెక్స్ కండోమ్లతో ఆయిల్, లోషన్, వాసెలిన్, ఆయిల్ ఆధారిత ల్యూబ్స్ ఉపయోగించడం మానుకోండి. నూనెలు రబ్బరు కండోమ్లను దెబ్బతీస్తాయి. దీంతో అవి చిరిగిపోతాయి. దీంతో అవాంఛిత గర్భం, లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదం కలుగుతుంది. 
 

condom

కండోమ్ లను తిరిగి ఉపయోగించొద్దు

ఒకసారి యూజ్ చేసిన కండోమ్ ను మళ్లీ ఉపయోగించకూడదు. అలాగే ఒకేసారి రెండు కండోమ్ లను ఉపయోగించకూడదు. మీరు కలయికలో పాల్గొన్న ప్రతిసారీ ఖచ్చితంగా కండోమ్ ను మార్చాలి. ఒకేదాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించడం వల్ల పురుషులు, మహిళలు ఇద్దరికీ సంక్రమణ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే యూజ్ చేసిన దాన్ని పారేయాలి.

click me!