మీరు ప్రేమించిన వ్వక్తి గురించి మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

First Published Dec 4, 2021, 4:48 PM IST

జీవితంలో (Life) ప్రతి ఒక్కరూ ఎవరితోనైనా ప్రేమలో పడుతుంటారు. కొందరి ప్రేమ పెళ్లికి దారి తీస్తుంది. మరికొందరి ప్రేమ మధ్యలోనే కొన్ని ఆటంకాలు ఏర్పడి తెగిపోతుంది. అయితే ప్రేమించుకున్న వారు అందరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చెప్పలేము. కొందరు ప్రేమించింది ఒకరిని అయితే పెళ్లి చేసుకునేది మరొకరిని. అయితే పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి పెళ్ళికి ముందు ప్రేమించిన వ్యక్తుల గురించి భాగస్వామితో చెప్పడం జరుగుతుంది. ఇలా భాగస్వామితో ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పడంతో ఏం జరుగుతుందో ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..
 

ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి ప్రేమలో కొన్ని ఆటంకాలు (Interruptions) ఏర్పడడంతో పెద్దలు కుదిర్చిన వివాహం (Marriage) చేసుకుంటారు. అయితే వారి దాంపత్య జీవితానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తి గురించి భాగస్వామికి తెలియ పరచడానికి ప్రయత్నిస్తారు.
 

భాగస్వామి (Partner) మంచి మనసున్న వ్యక్తి అయితే మీ నిజాయితీని (Honest) అర్థం చేసుకుంటాడు. మీతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడతారు. మీ దాంపత్య జీవితాన్ని నిలుపుకోవడానికి మీ మధ్య గొడవలు ఏర్పడకుండా ఉండడానికి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని మీ మనసును అర్థం చేసుకుంటాడు.

ఇలా అర్థం చేసుకునే భాగస్వామి దొరికినప్పుడు మీరు చాలా అదృష్టవంతులు (Good luck) అని చెప్పవచ్చు. మీ భాగస్వామి మంచి మనసును మీరు అర్థం చేసుకొని ఇక ముందు ఎటువంటి సమస్యలు (Problems) కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు పెళ్లి తర్వాత కూడా ప్రేమించిన వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే మీ ఇద్దరిని కలపడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు.
 

మీ ఇద్దరి సుఖాన్ని (Happiness) కోరుకుంటాడు. ఇలా చేయడం మీ భాగస్వామి మంచి మనసుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో కొందరు ఉంటారు. అదే భాగస్వామి అనుమానించే (Suspect) వాడు, హింసాత్మక ధోరణి కలిగిన వాడైతే మీ దాంపత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఎవరితో మాట్లాడినా ఏమి చేసినా చీటికీమాటికీ అనుమానించడం చేస్తుంటారు.

మిమ్మల్ని సూటిపోటి మాటలతో వేధించడం (Harassment) జరుగుతుంది. మీరు ఏ పని చేసినా తనకు తప్పుగా (Wrong) అనిపిస్తుంది.  మీరు సర్దుకుపోవడానికి ఎంత ప్రయత్నించినా మీ మనసును అర్థం చేసుకోడు. తన మనసులో మీరు పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పిన మాటలే గుర్తుకు వస్తుంటాయి.

తన మనసులో మీ పట్ల ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. అయితే మీరు కూడా మీ దాంపత్య జీవితం (Marital life) బాగుండాలంటే తమ వంతు ప్రయత్నం చేయాలి. పెళ్లి తర్వాత మీ భాగస్వామిని మనస్ఫూర్తిగా (Mentally) ఇష్టపడడానికి ప్రయత్నించాలి. పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ మీ జీవితాన్ని నాశనం చేసుకోరాదు.
 

ఇలా చేయడంతో మీ ఇద్దరి జీవితాలు నాశనమవుతాయి. పెళ్లి తర్వాత మీరు కొత్త జీవితాన్ని  ప్రారంభించడానికి ప్రయత్నించాలి.

click me!