ఇలాంటి స్నేహితులు మీ జీవితంలో ఉండటం అదృష్టం..!

First Published | Dec 4, 2021, 1:08 PM IST

వారు మీకు వెన్నుముకలా అండగా ఉంటారు. మీకు విజయం ఎంత ముఖ్యమో.. వారికి మాత్రమే తెలుస్తుంది. మిమ్మల్ని గెలిచేలా ప్రోత్సహించడం కూడా వారి వల్లే సాధ్యమౌతుంది. కాబట్టి.. అలాంటి స్నేహితులను గ్రాంటెడ్ గా తీసుకోవద్దు.
 


ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు కీలక పాత్ర పోషిస్తారు. ఒక మనిషి ఎలాంటివాడో.. అతని స్నేహితులను  చూసి చెప్పేయవచ్చు అని కూడా ఉంటారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మనకు అండగా నిలిచేవాడే స్నేహితుడు. అలాంటి ఫ్రెండ్స్ మన జీవితంలో ఉన్నందుకు మనం చాలా అదృష్టం చేసుకున్నట్లే లెక్క. అయితే.. కొందరు మన కోసం అంత చేసే స్నేహితులను పెద్దగా పట్టించుకోరు. వారు మన కోసం ఎన్ని చేసినా గ్రాంటెడ్ గా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివారిని మాత్రం అస్సలు గ్రాంటెడ్ గా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వారెవరో ఓసారి చూసేద్దామా..
 

మీరు ఏమి చేసినా ఎల్లప్పుడూ మిమ్మల్ని ఉత్సాహపరిచే స్నేహితులు ఉంటే మీరు అదృష్టవంతులనే చెప్పాలి. అలాంటి వారిని ఎప్పుడూ మీరు గ్రాంటెడ్ తీసుకోవద్దు. ఎందుకంటే.. మీరు ఎల్లప్పుడూ అలాంటి స్నేహితులపై ఆధారపడే అవకాశం ఉంటుంది. వారు మీకు వెన్నుముకలా అండగా ఉంటారు. మీకు విజయం ఎంత ముఖ్యమో.. వారికి మాత్రమే తెలుస్తుంది. మిమ్మల్ని గెలిచేలా ప్రోత్సహించడం కూడా వారి వల్లే సాధ్యమౌతుంది. కాబట్టి.. అలాంటి స్నేహితులను గ్రాంటెడ్ గా తీసుకోవద్దు.


ఛాన్స్ దొరికిన ప్రతిసారీ మనకు ఏదో ఒకటి చెప్పేవారు మన చుట్టూ చాలా మందే ఉంటారు. కానీ.. మనకు ఆనందం వచ్చినా.. బాధ వచ్చినా.. మనం చెప్పేది వినేవారు కూడా ఉండటం ఈ జీవితంలో  చాలా ముఖ్యం. అలా మీ కష్టాలు, ఆనందాలు చెప్పుకునేటప్పుడు ఒపికగా వింటూ.. మీకంటూ ఏదైనా చెప్పుకోవడానికి ఒకరు ఉన్నారు అనే వ్యక్తులను అస్సలు వదులుకోకూడదు. 

ఇక మీరు జీవితంలో ఎన్ని కష్టాల్లో ఉన్నా.. సానుకూలంగా స్పందిస్తూ.. మీకు అండగా ఉండే స్నేహితులు  చాలా మంది ఉంటారు. అలాంటి స్నేహితులు మీ జీవితంలో కనుక ఉంటే.. వారిని అస్సలు వదిలిపెట్టకూడదట. వీరు.. మీలో ఎప్పుడూ పాజిటివిటీ నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

మీ పరిస్థితి ఎంత  చెత్త పరిస్థితిలో ఉన్నా, ఈ వ్యక్తి మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు  అలాంటి వాళ్ళని దూరం చేసుకుంటే.., చివరికి అన్నీ పోగొట్టుకునేది మీరే. ఈ వ్యక్తులు మీరు ఏ సమయంలోనైనా అండగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు దొరకాలంటే మీకు చాలా అదృష్టం ఉండాలి.

మీ జీవితంలో ఎల్లప్పుడూ ఒక ఎక్స్ట్రావర్ట్   స్నేహితుడిని కలిగి ఉండండి ఎందుకంటే వారు మీ ఒంటరితనాన్ని దూరం చేస్తారు. కాబట్టి.. అలాంటి వారు మీ లైఫ్ లో ఉంటే.. అస్సలు వదులుకోకూడదు. వారికంటే.. మీకే వారి అవసరం ఎక్కువ.  మీకు వారు మరింత అవసరం. మీకు ఉత్సాహాన్ని వారే అందించగలరు. 

Latest Videos

click me!