ఏ వయసులోనైనా ఒక స్త్రీ, ఒక పురుషుడు మధ్య ప్రేమ ఏర్పడుతుంది. నిజమైన ప్రేమ ఉన్న చోట అందానికి స్థానం ఉండదు. ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మనస్సును ఒకటి చేస్తుంది. ప్రేమ బంధంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులే (Equal). ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం వుండదు. ప్రేమ సమాన భావాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి ప్రేమ స్త్రీ, పురుషుల మధ్య ఉండాలి. దాపరికాలు (Hides) లేని ప్రేమ ఎలాంటి గొడవలకు కారణం కాదు. ప్రేమ ఉన్నచోట అర్థం చేసుకునే స్వభావం ఉండాలి. ఒకరికొకరు అనే భావన కలగాలి.