శృంగారమంటే ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. దాని మీద ఎంత ఆసక్తి ఉన్నా... కొందరు మాత్రం పడక గదిలో ఫెయిల్ అవుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి? ఎలా మెప్పించాలి? అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ, నిస్పృహలో తమలో పెంచుకున్నారు.
ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ యుగంలో.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడపడమే గగనమైపోయింది. దొరికిన కాస్తో, కూస్తో సమయంలోనే పార్టనర్ ని మెప్పించాలి. అందుకు ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది సెక్స్ లో పాల్గొనడానికి ముందు పవర్ ఫుల్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు. అదేమీ అంత మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. శుభ్రంగా స్నానం చేస్తే చాలని.. దుర్వాసన రాకుండా ఉంటే సరిపోతుందని అంటున్నారు. మీకు నచ్చిన పర్ఫ్యూమ్ వాసన మీ భాగస్వామికి నచ్చాలని లేదు కదా.
చాలా మంది యోగా, వ్యాయామం వంటి వాటికి దూరంగా ఉంటారు. అయితే.. రోజూ ఓ అరగంట పాటు ఏరోబిక్స్ చేస్తే.. మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. పురుషులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. టెస్టోస్టిరాన్ స్థాయి పెరిగి శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
డార్క్ చాక్లెట్లు తినడం మంచిది. ఇది ప్రేమ భావాలను పెంపొందిస్తోంది. అయితే అలా అని ఎక్కువ మొత్తంలో తినకూడదు. తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కాబట్టి కొద్ది మొత్తంలో తీసుకుంటే సరిపోతుంది. రాత్రి వేళల్లో శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి.
అప్పుడప్పుడు శరీరానికి మసాజ్ చేయించుకోవడం లేదా ఆవిరి స్నానం చేయడం వల్ల రక్త సరఫరా మెరుగై, శరీరం శృంగారానికి సమాయత్తమవుతుంది.