త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఇదే మార్గం..!

First Published | Nov 30, 2020, 3:32 PM IST

మధ్యానం 12 నుండి 2 గంటల మధ్య..ఈ సమయంలో స్త్రీ,పురుషులు ఇద్దరు బిజీ వర్క్ లో ఉంటారు.కాబట్టి శృంగారం చేసుకోవడానికి ఇష్టపడరు.
 

శృంగారం అనగానే... చాలా మంది అది రాత్రిపూట మాత్రమే చేసేది భావిస్తుంటారు. ఇక పిల్లల విషయంలో.. చాలా మంది తాము శారీరకంగా రోజూ కలుస్తున్నప్పటికీ.. పిల్లలు కలగడం లేదని బాధపడుతుంటారు.
అయితే.. శృంగారం అనేది చీకటి వ్యవహారం అనే విషయాన్ని ముందు మరిచిపోవాలి. వెంటనే పిల్లలు కలగాలనుకునే దంపతులు మాత్రం కొన్ని నిర్ధిష్ట సమయాల్లో శృంగారంలో పాల్గొంటే.. మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఒకసారి మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...

ఉదయం 6 నుండి 8 మధ్య..ఈ సమయంలో పురుషులకు శృంగార వాంఛ ఎక్కువగా ఉండటమే కాదు..ఆ సమయంలో వారి పవర్ బాగా ఉంటుందట.ఇది మహిళల విషయంలో పూర్తి విరుద్దం.
ఉదయం 8 నుండి 10 మధ్య..ఈ సమయంలో ఎండార్ఫిన్ అనే అర్మోన్లు విడుదల అవ్వడం వల్ల మహిళలకు శృంగార వాంఛ పెరుగుతుందట.కాని పురుషులలో ఈ సమయంలో శృంగార వాంఛ తగ్గుతుందట.అయితే ఇద్దరు ఇష్టపడితే శృంగారంలో ఎంజాయ్ చేయచ్చు.
మధ్యానం 12 నుండి 2 గంటల మధ్య..ఈ సమయంలో స్త్రీ,పురుషులు ఇద్దరు బిజీ వర్క్ లో ఉంటారు.కాబట్టి శృంగారం చేసుకోవడానికి ఇష్టపడరు.
మధ్యానం 2 నుండి సాయంత్రం 4గంటల మధ్య..ఈ సమయంలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందట.అంతే కాదు ఈ సమయంలో పురుషుల నుండి విడుదల అయ్యే వీర్యం కుడా నాణ్యమైనది గా ఉంటుందట.కాబట్టి ఈ సమయంలో శృంగారం చేస్తే పిల్లలు కలిగే అవకాశం ఉంటుందట.కాని ఎక్కువ మంది స్త్రీ లు ఈ సమయంలో ఇష్టపడరు.
సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య..ఈ సమయంలో స్త్రీ ,పురుషుడు ఇద్దరికీ ఎక్కువగా ఆకలి వేస్తుందట.అంతే కాదు శృంగార వాంఛ,పవర్ చాలా తక్కువగా ఉంటుందట.కాబట్టి ఈ సమయంలో శృంగారం చేసుకోవడానికి అణువు కాదట.
రాత్రి 8 నుండి 10గంటల వరకు..ఈ సమయంలో ఇద్దరిలోను శక్తి నిల్వలు పెరిగి..శృంగారానికి అణువుగా తయారవుతాయట. కనుక ఈ సమయం శృంగారానికి అత్యంత అణువైనదట .
రాత్రి 10నుండి 12 గంటల వరకు..శృంగారం చేసుకోవడానికి ఈ సమయం చాలా అణువైనదట. ఎందుకంటే ఈ సమయంలో వారి హార్మోన్లు భాగా ఎక్కువగా పనిచేస్తాయట .కాకపోతే.. మంచి నిద్రసమయం కావడంతో.. చాలా మంది ఆసక్తి చూపించరట.

Latest Videos

click me!