హనీమూన్ కు చాలా మంది ఎక్కడికి వెళ్తారో తెలుసా?

First Published | Mar 8, 2024, 2:05 PM IST

మన దేశంలోనే మనం చూడాల్సిన, తిరగాల్సిన అందమైన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మంచి రొమాంటిక్ హానీమూన్ ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. మీకు తెలుసా? మన దేశంలో చాలా మంది జంటలు హనీమూన్ కు ఇక్కడికే వెళుతుంటారు. అవేంటంటే? 
 

ఈ ప్రపంచంలో ఎన్నో అద్బుతాలు దాగున్నాయి. అందుకే వీలైనప్పుడల్లా చాలా మంది ప్రపంచ యాత్రకు బయలు దేరుతుంటారు. ఇక కొంతమంది జంటలు ఏకంగా హనీమూన్ కు కూడా ప్రపంచాన్ని చుట్టేస్తుంటారు. ప్రపంచం సంగతి పక్కన పెడితే మన దేశంలో కూడా కనువిందు చేసే ఎన్నో అబ్బురపరిచే ప్లేసెస్ ఉన్నాయి. కోటలు, పురాతన దేవాలయాలు, బీచ్ లతో పాటుగా మంచి హనీమూన్ స్పాట్స్ కూడా ఉన్నాయి. చాలా జంటలు మన దేశంలోనే హనీమూన్ కు వెళ్తుంటారు. హనీమూన్ ప్రతి కపుల్ కు ప్రత్యేకం. ఈ క్షణం జీవితంలో మళ్లీ రాదు. అందుకే మన దేశంలో రొమాంటిక్ హనీమూన్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గోవా

హనీమూన్ కు గోవా బెస్ట్ డెస్టినేషన్. అవును ఇక్కడుండే బీచ్ లు , పచ్చని చెట్లు, ఇసుక, లేట్ నైట్ పార్టీలు.. ఇలా ప్రతి ఒక్కటీ మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఇక్కడికి వెళ్లారంటే తిరిగి రావాలనిపించదంటే నమ్మండి.  మీకు తెలుసో లేదో కానీ పెళ్లి తర్వాత చాలా మంది కపుల్స్ ఇక్కడికే హనీమూన్ కు వెళ్తుంటారు. మన దేశంలో హనీమూన్ కు ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకోటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి మీరు ఇక్కడికి చాలా తక్కువ డబ్బుతో వెళ్లొచ్చు. పెళ్లి తర్వాత కపుల్స్ గోవాకే హానిమూన్ కు వెళ్లడానికి ఇది కూడా కారణమే.
 


మనాలి

మనాలీ అందాలను మాటల్లో వర్ణించలేం. మనాలీ అందానికి పెట్టింది పేరు. ఇక్కడ వీచే చల్లని గాలులు, మంచు మిమల్ని స్వర్గంలోకి తీసుకెళ్తాయి. నిజంగా ఇక్కడ మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ లో హనీమూన్ కు వెళ్లాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. చల్లని గాలులు, చుట్టూ అందం ఇంతకంటే మంచి ప్లేస్ ఉంటుందా మిమ్మల్ని మీ భాగస్వామిని మరింత దగ్గర చేయడానికి. ఇక్కడికి చాలా మంది సీజన్లతో సంబంధం లేకుండా వెళ్తుంటారు. 

శ్రీనగర్

శ్రీనగర్ సరస్సులను చూడటానికి మన రెండు కళ్లూ చాలవంటే నమ్మండి. అందుకే చాలా మంది పెళ్లి తర్వాత హనీమూన్ కోసం ఇక్కడికే వెళ్తుంటారు. ఒకవేళ మీరు మీ భాగస్వామితో కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ మీకు హౌస్ బోట్  కూడా ఉంటుంది. ఇక్కడుండే అందమైన హౌస్ బోట్ మీ హనీమూన్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శ్రీనగర్ అందాలను చూడటానికి ఇక్కడికి కపుల్స్ ఏడాది పొడవునా వస్తుంటారు. 

ఉదయపూర్

చాలా మంది పెళ్లి తర్వాత ఖచ్చితంగా ఉదయ్ పూర్ కూడా వెళ్తుంటారు. రొటీన్ గా కాకుండా మీరు కూడా ఏదైనా స్పెషల్ గా చేయాలనుకుంటే మాత్రం మీ భార్యతో కలిసి ఉదయ్ పూర్ వెళ్లండి. హనీమూన్ కు బెస్ట్ ప్లేస్ అనడానికి ఇక్కడ ఎన్నో అందమైన ప్యాలెస్ లు ఉంటాయి. దీన్ని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. 

Latest Videos

click me!