ముకేష్-నీతా అంబానీ కపుల్ నుంచి ఈ విషయాలు నేర్చుకోవాల్సిందే..!

First Published | Mar 6, 2024, 2:17 PM IST

ఒక పవర్ ఫుల్ కపుల్ గా ఈ జంట నుంచి, కుటుంబ విలువల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రొఫెషనల్ గా వారు ఎంత బిజీగా ఉన్నా.. పర్సనల్ గా వారు వారి కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు.
 


అందరికీ ముకేష్ అంబానీ దేశంలోనే అత్యధిక ధనవంతుడిగా, ఓ వ్యాపారవేత్తగా  మాత్రమే తెలుసు. అయితే.. ఆయన ఎంత సంపద ఉన్నా తన కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎంతో బిజీ వ్యాపారవేత్త అయినా.. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆయన మాత్రమే కాదు.. ఆయన భార్య నీతా అంబానీ సైతం బంధాలను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు.
 

ఒక పవర్ ఫుల్ కపుల్ గా ఈ జంట నుంచి, కుటుంబ విలువల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రొఫెషనల్ గా వారు ఎంత బిజీగా ఉన్నా.. పర్సనల్ గా వారు వారి కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు.
 


ఒక వ్యాపారవేత్తగా ముకేష్ అంబానీ చాలా బిజీగా ఉంటారు. ఆయన మాత్రమే కాదు.. నీతా అంబానీ సైతం తమ వ్యాపారాలను చూసుకుంటూ ఉంటారు. అయినా సరే.. తమ ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడుపుతూ ఉంటారట. పిల్లలకు సంబంధించిన ప్రతి మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేయడం, పిల్లలకు అవసరమైన సమయంలో వారికి అండగా నిలపడటంతో ఎప్పుడూ ముందుంటారు.  అన్నింటికంటే.. కుటుంబ బంధానికే వాళ్లు ఎక్కువ విలువ ఇవ్వడం ఈ కాలం వాళ్లు అందరూ నేర్చుకోవాల్సిందే.

ఏ బంధంలో అయినా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే.. సమస్యలు మొదలౌతాయి. అందుకే.. ముకేష్, నీతాలు.. తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకుంటారట. దాని వల్ల వారి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. ప్రతి విషయంలోనూ నిజాయితీ గా ఉంటారట. ఇది కనుక దంపతులు అందరూ నేర్చుకుంటే వారి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉండదు.
 

అంబానీ ఫ్యామిలీ రోజు రోజుకీ విజయవంతమౌతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. సక్సెస్ మంత్ర గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. అయితే... వారి సక్సెస్ మంత్ర లక్ష్యాలు, వాల్యూస్ షేర్ చేసుకోవడమే. వ్యాపారంలో ఎలా అయితే లక్ష్యాలను షేర్ చేసుకుంటారో.. తమ జీవితంలోనూ  వైవాహిక బంధాన్ని బలం చేసుకోవడానికి  వారు కొన్ని లక్ష్యాలు, వాల్యూస్ ఫాలో అవుతారట. దాని వల్లే.. వారి బంధం ఇన్ని సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా ముందుకు సాగుతోంది.
 

ప్రతి బంధంలోనూ ప్రత్యేకంగా ఉండాల్సింది గౌరవం.  ఒకరిపై మరొకరికి గౌరవం ఉన్నప్పుడు ఆ బంధం బలంగా నిలపడుతుంది.  ఈ విషయంలో ముకేష్, నీతాలు ముందుంటారు. వారు ప్రతి విషయంలో ఒకరికి మరొకరు గౌరవం ఇచ్చుకుంటారట. ఇది దాంపత్య బంధానికి చాలా అవసరం.

ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు, డ్రీమ్స్ ఉంటాయి. అయితే... ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఎవరైనా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే.. లైఫ్ పార్ట్ నర్ సపోర్ట్ ఉంటే.. సులభంగా సాధించవచ్చు. ఈ విషయంలో ముకేష్, నీతాలు ముందుంటారు. వారిద్దరూ ప్రతి విషయంలోనూ ఒకరితో మరొకరు తోడుగా ఉంటారట. ఈ విషయం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే.

mukesh nita radhika

కాస్త డబ్బు ఉంటేనే చాలా మంది  చాలా పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ.. కోట్ల ఆస్తులు ఉన్నా ఆ అహం తలకి ఏనాడు ఎక్కించుకోలేదు. తమ రూట్స్ ని మర్చిపోలేదు.  అందుకే వారి బంధం ఇప్పటికీ బలంగా సాగుతోంది. వారు మాత్రమే కాదు.. వారి పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా పెంచడం  విశేషం.
 

వ్యాపారం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అయితే.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా.. వాటిని ఎదుర్కొనడంలో ఒకరికి మరొకరు ఎప్పుడూ తోడుగా ఉంటారట. అందుకే.. వారు పవర్ ఫుల్ కపుల్ గా నిలిచారు. 
 

Mukesh, Nita Ambani

బాధలను మాత్రమే కాదు సంతోషాలను సైతం వీరు కలిసే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారట.  తమ కుటుంబంలో జరిగే చిన్న, పెద్ద సందర్భం ఏదైనా సరే దంపతులు ఇద్దరూ కలిసే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారట. ఇద్దరూ కలిసి మెమరీస్ ని పోగేసుకుంటారు. ఈ రూల్స్ ఫాలో అయితే.. ఏ దాంపత్య జీవితమైనా ఆనందంగా సాగుతుంది.

Latest Videos

click me!