అబ్బాయిలతో ఈజీగా ప్రేమలో పడిపోతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

First Published Nov 20, 2021, 2:02 PM IST

ప్రతి అమ్మాయి మనసులో తనకిష్టమైన ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని తన కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలని భావిస్తోంది. తనపై మాత్రమే ఎక్కువ ప్రేమ (Love) చూపించాలని కోరుకుంటుంది. అబ్బాయి చూపించే ప్రేమలో ఎటువంటి లోపం ఉన్నా ఆ అమ్మాయి మనసు చిన్నబోతుంది. ఆ అమ్మాయి మనసుకుకి గాయం అయినప్పుడు ఇతరుల ఓదార్పు కోసం ఎదురు చూస్తుంది. ఈ ఓదార్పులో మరొక అబ్బాయితో ఈజీగా లవ్ లో పడిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఒక అమ్మాయి అబ్బాయిలతో ఈజీగా లవ్ లో పడిపోవడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం..
 

ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి నమ్మకాన్ని (Believe) కలిగిస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి కూడా తనను కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలని భావిస్తుంది. ఆ అబ్బాయితో తన జీవితాన్ని అందమైన పూలబాటగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అబ్బాయితో ఉన్న ప్రతి క్షణాన్ని కొత్తగా మార్చుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. అబ్బాయి తనను ఒక మహారాణిలా (Queen) చూసుకోవాలని కోరుకుంటుంది. ఇలా చూసుకునే అబ్బాయి దొరికినప్పుడు ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. ఈ ప్రయత్నంలో అమ్మాయి ఒక మంచి అబ్బాయితో ప్రేమలో పడుతుంది.
 

ఆ అబ్బాయిని తన సర్వస్వంగా భావిస్తుంది. ఇలా వీరి ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో అనుకోని ఒడిదుడుకులు ఎదురౌతాయి. అలాంటప్పుడు తను ప్రేమించే అబ్బాయి తన నుంచి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆమెలో తెలియని అభద్రత భావం (Sense of insecurity) పెరుగుతుంది. దీంతో ఆమె ఇంకో అబ్బాయితో ఎక్కడ లవ్ లో పడిపోతానేమోనని భయపడుతుంది. ఇలా మరొక అబ్బాయిలు ప్రేమలో పడిపోవడానికి ఆమె బలహీనమైన మనస్సు (Weak mind) కారణం కావచ్చు. మన మనసును మన స్వాధీనంలో పెట్టుకున్నప్పుడు అది తప్పు దారిలో నడవడానికి ప్రయత్నించదు.

మన మనసులో ఒకరిని ఊహించుకున్నప్పుడు తనపై అపార నమ్మకం అనేది ఉండాలి. నమ్మకము ప్రేమకు (Love) పునాది లాంటిది. నమ్మకం (Believe) లేని చోట ప్రేమ ఉండదు. మనం ప్రేమించిన అబ్బాయి మనకు దూరం కావడానికి గల కారణాలు గురించి తెలుసుకోవాలి. అబ్బాయిని అర్థం చేసుకోవడానికి మనవంతు ప్రయత్నం చేయాలి. మనలో నిజాయితీ ప్రేమ ఉన్నప్పుడు అతను తిరిగి వస్తాడనే భావం మనలో ఉండాలి. మన మనస్సు బలహీనపడితే ఇతరులతో ఈజీగా లవ్ లో పడిపోతారు. ప్రస్తుత కాలంలో చాలా మంది వద్ద ఉన్న రిలేషన్ షిప్ అయోమయంగా ఉంటోంది.
 

మనుషుల మీద నమ్మకం, విశ్వాసం బలంగా ఉండాలి. రిలేషన్ షిప్ (Relationship) ను లైట్ గా తీసుకోరాదు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ జీవితాన్ని ప్రారంభించాలి. ఒకరి మీద ఒకరికి అపారమైన నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు వారి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వారి ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు (Difficulties) ఉండవు.

click me!