Relationship: స్లీప్ డైవర్స్ అంటే ఏమిటో తెలుసా.. తెలియకపోతే, కచ్చితంగా తెలుసుకోండి!

First Published | Oct 6, 2023, 4:03 PM IST

 Relationship: స్లీప్ డైవర్స్ అనేది నేటి దంపతులకు ట్రెండింగ్ గా మారింది. ఒత్తిడితో కూడిన జీవన విధానంలో భార్యాభర్తలు  అనవసరమైన గొడవలు పడటం కంటే స్లీపింగ్ డైవర్స్ తీసుకోవటం మంచిది అని రిలేషన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అయితే ఏమిటి ఈ స్లీప్ డైవర్స్.. తెలుసుకుందాం రండి.
 

భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకోవటం అనేది వాళ్ల అన్యోన్య దాంపత్యానికి ఎంతో అవసరం. కేవలం శృంగారం కోసం మాత్రమే కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి అది మంచి అవకాశం. అయితే ఇటీవల కాలంలో స్లీప్ డైవర్స్ అనేది ట్రెండింగ్ గా మారింది.
 

ఇంతకీ ఏమిటి ఈ స్లీప్ డైవర్స్ అంటే.. సాధారణంగా రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటారు. అయితే అదే సమయంలో భాగస్వామి గురకపెట్టడం లేదంటే వారి యొక్క పర్సనల్ పనుల కోసం గదిలో లైట్ వేసి ఉండటం లేదంటే ఏదో సౌండ్ చేయటంవలన నిద్రకి భంగం వాటిల్లుతుంది.

Latest Videos


 ఒత్తిడితో కూడిన వ్యక్తి ఆ నిద్ర భంగాన్ని భరించలేరు. అనవసరంగా దంపతులిద్దరి మధ్యన గొడవలు జరుగుతాయి.  అయితే నేటి రాత్రి సరి అయిన నిద్ర లేకపోవడం అనేది మరుసటి రోజు యొక్క చురుకుతానాన్ని తగ్గిస్తుంది. కాబట్టి దంపతుల మధ్య కొద్ది రోజులపాటు స్లీప్ డైవర్స్ విధానాన్ని అనుసరించడం మంచిది.

దీనివలన లాభాలేమిటంటే దంపతుల నిద్ర యొక్క నాణ్యత మెరుగుపడుతుంది. జంటలు వారి వ్యక్తిగత స్వేచ్ఛను పొందుతారు. ఓపెన్ బెడ్ అనేది మంచి నిద్రని ఇస్తుంది. ఆరోగ్యకరమైన దాంపత్య సంబంధానికి ఒకే మంచం మీద పడుకోవలసిన అవసరం లేదు.

భాగస్వామి అలవాట్లు కారణంగా తోటి భాగస్వామి నిద్ర విషయంలో రాజీ పడుతుంటే స్లీప్ డైవర్స్ ఎంచుకోవడం తప్పుకాదు అని రిలేషన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అయితే స్లీప్ డైవర్స్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరగాలి.

 ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలి. ఒకరి అవసరాలని మరొకరు గుర్తించి అవగాహనతో అర్థం చేసుకుంటే ఈ స్లీప్ డైవర్స్ అనేది  ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

click me!