సెక్స్ సమయంలో భార్యతో ఇలా అస్సలు ప్రవర్తించకూడదు..!

First Published | Oct 6, 2023, 3:43 PM IST

వైవాహిక జీవితంలో శృంగారం చాలా ముఖ్యం. ఇది వారి బంధాన్ని బలపరుస్తుంది. అయితే శారీరక సంబంధంలో విభేదాలొస్తే పెళ్లి విడాకుల వరకు చేరొచ్చంటున్నారు నిపుణులు. మీ సెక్స్ లైఫ్ హ్యాపీగా సాగాలంటే మాత్రం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. 
 

ఒకరి ఇష్టాయిష్టాలను ఒకరు తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకుంటేనే సెక్స్ లైఫ్ సాఫీగా, ఆనందంగా సాగుతుంది.  దంపతుల్లో ఏ ఒక్కరు తమ కోరికలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటే వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.  ముఖ్యంగా మీ భాగస్వామి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటే సెక్స్ పట్ల ఆసక్తి చాలా వరకు తగ్గుతుంది. దీంతో కారణాలు లేకుండా మీ మధ్య గొడవలు జరుగుతాయి. 
 

Sex Positions

ఏదేమైనా సెక్స్ లైఫ్ బాగుండాలంటే దంపతుల మధ్య ప్రేమ, నమ్మకం, గౌరవం, అభిరుచి ఖచ్చితంగా ఉండాలి. లైంగిక జీవితంలో సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీ సెక్స్ లైఫ్ బాగుండటానికి మీరిద్దరు చిన్న విషయాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మొదట అది చిన్న సమస్యగానే అనిపిస్తుంది. రానురాను పెద్ద సమస్యగా మారిపోయి మీ వైవాహిక జీవితాన్ని రిస్క్ లో పడేస్తాయి. ముఖ్యంగా భాగస్వామిపై నమ్మకం పోయి ఒత్తిడి పెరుగుతుంది. మరి పడకగదిలో మీరు చేసే ఎలాంటి తప్పులు మీ వైవాహిక జీవితానికి ఆటంకం కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 


బెడ్ రూమ్ లైటింగ్

సాధారణంగా ఆడవారికి పడకగదిలో వెలుతురు ఉండటం ఇష్టముండదు. ముఖ్యంగా చాలా మంది ఆడవారు చీకట్లోనే సెక్స్ లో పాల్గొనాలనుకుంటారు. కొంతమంది మాత్రమే వెలుతురులో సెక్స్  లో పాల్గొనడానికి ఇష్టపడతారు. అందుకే మీ భార్యకు లైట్ వెలుతురు నచ్చుతుందో లేదో తెలుసుకోండి. ఒకవేళ వారి ఇష్టానికి వ్యతిరేకంగా మీరు లైట్ వేసి సెక్స్ లో పాల్గొంటే మీ మధ్య గొడవలు జరగొచ్చు.  భాగస్వామి అభిరుచులకు అనుగుణంగా సర్దుకుపోవడం చాలా ముఖ్యం. భాగస్వాములు ఒకరినొకరు అర్థం చేసుకుని తదనుగుణంగా వ్యవహరిస్తే మీ వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. 
 

వ్యక్తిగత పరిశుభ్రత

ఎవ్వరికైనా సరే వ్యక్తిగత పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. అలాగే మీ లైంగిక జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. అందుకే శృంగారానికి ముందు ఇద్దరూ ప్రైవేటు భాగాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే చేతి గోర్లను చిన్నగా కత్తిరించుకోవాలి. గోర్లు పొడుగ్గా ఉంటే మీ భాగస్వామి శరీరానికి మంచిది కాదు. ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోకపోతే అక్కడి నుంచి వచ్చే దుర్వాసన భాగస్వామి మానసిక స్థితిని పాడు చేస్తుంది. అందుకే సెక్స్ లో పాల్గొనడానికి ముందు క్లీన్ చేసుకోవాలి.
 

మితిమీరిన మాటలు

శృంగారానికి ముందు డర్టీ టాక్ మంచిదని చాలా మంది అంటుంటారు. అవును ఇది మీ ఇద్దరినీ సెక్స్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. కానీ ఇది మరీ ఎక్కువగా ఉండకూడదు. శారీరక సంబంధంలో ఉన్నప్పుడు కొద్ది సేపు మాట్లాడటం అవసరమే. కానీ మీరు ఎక్కువ సేపు ఇలాగే మాట్లాడితే మీ భాగస్వామికి మూడ్ పోయే అవకాశం ఉంది. 
 

మాజీ భర్త, లవర్

మీరు మీ భాగస్వామితో ఒంటరిగా ఉన్నప్పుడు మీ గతం గురించి ఎప్పుడూ కూడా ప్రస్తావించకండి. ఎందుకంటే ఇది మీ బంధాన్నిబ్రేక్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు మీ మాజీ భర్త లేదా  లవర్ గురించి అస్సలు మాట్లాడకండి. ఎవ్వరైనా ప్రస్తుత భార్యకే ప్రాముఖ్యతనివ్వాలి.  మీ భాగస్వామి సంతోషంగా ఉండాలంటే ముందు మీరు  హ్యాపీగా ఉండాలి. 
 

గ్యాడ్జెట్లకు దూరంగా

కొంతమంది సెక్స్ సమయంలో కూడా ఫోన్లను వాడుతుంటారు. అంటే ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి సంతోషం పోతుంది. మానసిక స్థితి కూడా పాడవుతుంది. అందుకే సెక్స్ లో పాల్గొనడానికి ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను దూరం పెట్టండి. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఆ క్షణాన్ని ఆస్వాదించడానికి  ఇది సహాయపడుతుంది. అలాగే మీ భాగస్వామి ఇష్టాఇష్టాలను కూడా తెలుసుకోవచ్చు. ఫోన్ ను వాడితే సెక్స్ యాంత్రికంగా మారుతుంది.

Latest Videos

click me!