వైవాహిక జీవితంపై అలాంటి ఫీలింగ్... మీకూ మొదలైందా?

First Published | Jul 6, 2022, 7:41 AM IST

 కొందరు మాత్రం.. ఎప్పుడెప్పుడు తమ జీవిత భాగస్వామి నుంచి దూరంగా పోదామా.. ఎప్పుడెప్పుడు విడిపోదామా అని చూస్తూ ఉంటారు. దానినే  Marital Hatred అని అంటారు. 

couple fight

పెళ్లి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొందరికి పెళ్లి తర్వాత జీవితం ఆనందంగా మారితే.. మరి కొందరికి మాత్రం ప్రశ్నార్థంగా మారుతుంది. కొందరు దంపతులు పెళ్లి తర్వాత.. ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా ఉంటే... కొందరు మాత్రం.. ఎప్పుడెప్పుడు తమ జీవిత భాగస్వామి నుంచి దూరంగా పోదామా.. ఎప్పుడెప్పుడు విడిపోదామా అని చూస్తూ ఉంటారు. దానినే  Marital Hatred అని అంటారు. అసలు ఈ మ్యారిటల్ హేట్రెడ్ అంటే ఏంటి..? ఇది మనలో మొదలైందని ఎలా గుర్తించాలి..? దీని వల్ల దంపతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటో ఓసారి  చూద్దాం..

దంపతుల మధ్య ఒక్కసారి వ్యతిరేకత, ద్వేషం మొదలైనప్పుడు.. వారి మధ్య వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతలా అంటే.. ప్రతి విషయంలోనూ దంపతులు.. ఒకరిపై మరొకరు లోపాలను వెతికే పనిలో పడతారట. ప్రతి విషయంలోనూ నీదే తప్పు అంటే.. నీదే తప్పు అని వాదించుకునే స్థాయికి వెళ్లిపోతారట.


ఇక.. దంపతుల మధ్య Marital Hatred మొదలైనప్పుడు.. ఒకరి అలవాట్లు కూడా మరొకరికి విసుగు పుట్టిస్తాయట. వారి సాధారణ అలవాట్లు కూడా మీకు చిరాకు తెప్పిస్తాయట. కనీసం ఇద్దరూ కమ్యూనికేషన్ కూడా సరిగా చేసుకోరట. అలా కాకుండా.. ఒకరితో ఒకరు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకునే దిశగా చర్చించుకుంటే తప్ప.. ఈ స్టేజీకి వచ్చిన తర్వాత కలిసి ఉండటం కూడా కష్టమే.

వైవాహిక ద్వేషం చాలా ప్రతికూలంగా మారుతుంది. మీ వివాహాన్ని భారీ స్థాయిలో బెదిరిస్తుంది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకుంటా.. ఏకంగా వారు విడాకులు తీసుకునేదాకా వెళ్లే ప్రమాదం ఉంది. లేదు.. తమకు విడాకులు వద్దు.. సమస్యను పరిష్కరించుకొని తాము కలిసి ఉండాలి అనుకుంటే మాత్రం... వారు మ్యారేజ్ థెరపిస్ట్, కౌన్సిలర్స్ తో మాట్లాడాల్సి ఉంటుంది. వారు సరైన చికిత్స అందించి.. మీ బంధం మళ్లీ సజావుగా సాగేందుకు మార్గం సుగమం చేస్తారు. 

Marital Hatred నుంచి బయటపడటానికి ఎలా ప్రయత్నించవచ్చు?

ఒక జంట ఒకరికొకరు ప్రత్యేకంగా ఉండే లక్షణాలపై దృష్టి పెట్టవచ్చు. మీ భాగస్వామిలో ఉన్న  మంచి లక్షణాలను అభినందించడానికి ప్రయత్నించాలి. మీరు వాటిని ఎందుకు ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోండి. మీ భాగస్వామితో మీ స్పర్శలను పెంచుకోండి. మీకు వీలైనప్పుడల్లా వారిని ముద్దు పెట్టుకోండి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగితే... దంపతుల మధ్య ఈ రకం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.

Latest Videos

click me!