ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే జీవితం ఇలానే ఉంటుంది..!

First Published | Mar 2, 2022, 4:50 PM IST

ఒకరంటే మరొకరికి కనీసం  ఇష్టం, అవగాహన కూడా లేకపోతే.. వారి దాంపత్య జీవితం చాలా నిస్తేజంగా ఉంటుందట. ఒకరిపై మరొకరికి కనీసం ఆసక్తి కూడా ఉండదట.

పెళ్లి ఇద్దరు వ్యక్తుల జీవితం. వారు ప్రతి విషయంలోనూ.. ఒకరికొకరు తోడుగా ఉంటూ  జీవితాంతం కష్ట సుఖాలను అనుభవిస్తూ బతకాల్సి ఉంటుంది. అయితే...  ఎంత మంచి దంపతులైనా.. ఇద్దరి మధ్య వాదనలు, గొడవలు, తగాదాలు చాలాంటివి జరగడం చాలా సహజం. అయితే... అసలు ఇష్టం లేకుండా పెళ్లి బంధంలోకి అడుగుపెడితే జీవితం ఎలా ఉంటుంది.
 

ఒకరంటే మరొకరికి కనీసం  ఇష్టం, అవగాహన కూడా లేకపోతే.. వారి దాంపత్య జీవితం చాలా నిస్తేజంగా ఉంటుందట. ఒకరిపై మరొకరికి కనీసం ఆసక్తి కూడా ఉండదట.

Latest Videos


ఇష్టం లేకుండా పెళ్లిళ్లు చేసుకునేవారు నిత్యం ఒకరిపై మరొకరు విమర్శలు  చేసుకుంటూనే ఉంటారట. ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఒకరి లోపాలను మరొకరు నొక్కిచెబుతూ ప్రతి వాడివేడి వాగ్వాదానికి పాల్పడుడూనే ఉంటారు. 

ఒకరంటే మరొకరికి ఇష్టం లేకుండా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన వారు.. ఒకరిని మరొకరు బాగా ఇరిటేట్ చేయాలని అనుకంటారు.మీరిద్దరూ మీ స్వంత వ్యక్తిగత ఆసక్తులపై మాత్రమే స్థిరపడతారు, మీ భాగస్వామికి సంబంధించినది కాదు కాబట్టి తగాదాలు, అపార్థాలతో నిండిన సంభాషణలు ఉంటాయి.

ఇక.. ప్రతి విషయంలో ఒకరితో మరొకరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడటం కంటే పోట్లాడుకుంటారు అని చెబితే బాగుంటుంది. ఒకరిని మరొకరు ఫూల్ చేయాలని అనుకుంటారు. ఎదుటివారిని  ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు.

మీరు, మీ భాగస్వామి ఒకరి చర్యల గురించి మరొకరు డిఫెన్స్‌గా  మారుతున్నారు అంటే.. వీరికి పెళ్లి బంధం మీద అయిష్టత ఉన్నట్లే. ప్రజలు తమ తప్పు అని తెలిసినప్పుడు, దానిని అంగీకరించడానికి ఇష్టపడనప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ ఈగో ఇష్యూస్ వస్తూనే ఉంటాయి.

click me!