మీ భర్తపై మరో మహిళ కన్ను పడిందా..? ఇలా చేస్తే కాపాడుకోవచ్చు..!

First Published | Dec 6, 2021, 10:03 AM IST

 మీ భర్త కు దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు. ఇలా వారితో మీరు మంచిగా ఉండటం వల్ల.. వారికి ప్రతి నిమిషం వారికి తప్పు చేస్తున్నామనే విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. చాలా మంది మహిళలు తమ మనసు మార్చుకునే అవకాశం ఉంది.

మన అనుకున్న వ్యక్తితో ఎవరైనా మాట్లాడితేనే తట్టుకోలేరు. ముఖ్యంగా స్త్రీలు.. తమ బాయ్ ఫ్రెండ్, భర్త తో ఎవరైనా మహిళలు మాట్లాడినా.. కాస్త చనువుగా ప్రవర్తించినా.. అస్సలు భరించలేరు. అలాంటిది.. మీ భర్తతో ఎవరైనా ఫ్లర్టింగ్ చేయడం.. మీ లైఫ్ పార్ట్ నర్ వారు దక్కించుకోవాలని అనుకుంటున్నారనే విషయం మనకు తెలిస్తే.. ఇంకేమైనా ఉందా..? మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? అయితే.. ఈ టెక్నిక్స్ తో మీ పార్ట్ నర్ కాపాడుకోండి.

ఎవరైనా మహిళ.. మీ భర్తపై కన్ను వేశారు అని తెలియగానే.. వెంటనే ఆమెపై గొడవకు వెళ్లొద్దు. దానికి బదులు.. ఆమెతో మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు ఆమెతో మంచిగా, స్నేహంగా ఉండటం వల్ల.. మీ మంచితనం తెలిసి.. ఆమె మీ భర్తపై ఆశపడటం తప్పు అని ఫీలయ్యే అవకాశం ఉంటుంది. మీ భర్త కు దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు. ఇలా వారితో మీరు మంచిగా ఉండటం వల్ల.. వారికి ప్రతి నిమిషం వారికి తప్పు చేస్తున్నామనే విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. చాలా మంది మహిళలు తమ మనసు మార్చుకునే అవకాశం ఉంది.


ఇక.. మీ భర్త కూడా సదరు మహిళతో చనువుగా ఉండటం.. ఆమె పట్ల ఆకర్షితుడౌతున్నాడనే విషయం మీకు తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడిపోకూడదు. ఈ విషయాన్ని మీ భర్తను వెంటనే డైరెక్ట్ గా అడిగేయకూడదు. దాని వల్ల పరిస్థితి మరీ దారుణమయ్యే అవకాశం ఉంది. గొడవ పడి విషయం తేల్చుకోవడానికి బదులు.. ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. సదరు మహిళపై మీ భర్త మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. మీ ఇద్దరి మధ్యా ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి.

మీ భర్తతో..  ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి.  మీ బంధంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా.. ముందు  మీ బంధానికి బీటలు పడకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయాన్ని ప్రశాంతంతగా కూర్చొని మాట్లాడుకోవాలి.  గొడవలు రాకుండా చూసుకోవాలి. సరదగా బయటకు వెళ్లడం లాంటివి చేయాలి. మీ మధ్య మరొకరు దూరకుండా చూసుకోవాలి

మీ భర్త పై మరో మహిళ ఆశ పడుతుంది అని తెలియగానే.. ఎవరికైనా దాదాపు నమ్మకం పోతుంది. కానీ...  అలా నమ్మకం కోల్పోకూడదట. మీ భర్త పై మరో మహిళ ఆశపడుతోంది కానీ.. మీ భర్త కాదు అనే విషయాన్ని గ్రహించాలి.  ఈ విషయంలో మీ భర్త  పొరపాటు లేదని తెలుసుకుని.. వారిపై నమ్మకం ఉంచాలి. 

మీ భర్తపై లేనిపోని అనుమానాలు, కోపం పెంచుకునే బదులు..  వారితో సంతోషంగా ఉండేలా చేయాలి. మీతో వారి లైఫ్ ఆనందంగా  ఉంటుందనే విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి. అలా చేయడం వల్ల.. మీ పార్ట్ నర్.. మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోవాలని అనుకోరు. వేరే ఏ మహిళ మాయలోనూ పడిపోరు.

Latest Videos

click me!