Relationship: భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి కారణం ఇదే..?

First Published | Jun 26, 2023, 3:09 PM IST

Relationship: ఎంత అన్యోన్యంగా ఉన్న దంపతులైనప్పటికీ పిల్లల పెంపకం విషయానికి వచ్చేటప్పటికి  గొడవలు ప్రారంభమవుతాయి. మరి ఆ సమస్యలేమిటో వాటికి పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం.
 

పిల్లలు ఉన్న ఇల్లు సంతోషాలు కొలువై ఉంటాయి. పిల్లలు ఉన్న దగ్గర ఎలాంటి నిరాశలు నిస్పృహాలు ఉండవు. అందుకే పెళ్లి అయిన దంపతులు ఎప్పుడెప్పుడా అంటూ పిల్లల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఒకసారి పిల్లలు పుట్టారా ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు.
 

అయితే పిల్లల పెంపకం విషయానికి వచ్చేసరికి ఇద్దరికీ అభిప్రాయ బేధాలు మొదలవుతాయి. పిల్లల మీద అతి ప్రేమతోనో పిల్లల మీద అది జాగ్రత్తగా దంపతులు ఇద్దరు ఒకరిని ఒకరు కించపరుచుకుంటూ ఉంటారు.
 


పిల్లల మీద వాళ్ల అభిప్రాయాన్ని మాత్రమే చూడటానికి ప్రయత్నిస్తారు తమ పార్ట్నర్ అభిప్రాయానికి పెద్దగా విలువ ఇవ్వకపోవడంతో అభిప్రాయ బేధాలు ప్రారంభమవుతాయి. అయితే చిన్ని చిన్ని సర్దుబాటులో చేసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరూ ఒక మాట మీద ఉండి పిల్లల్ని పెంచినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.
 

లేకపోతే ఇదే విషయాన్ని ఇవ్వాల్సిగా తీసుకొని మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి పిల్లలు కూడా కారణం అవుతారు. ముఖ్యంగా పిల్లలకి బట్టలు కొనే విషయం దగ్గర నుంచి వాళ్లని రెస్టారెంట్ వరకు తమ పంతమే నెగ్గాలని చూస్తారు సదరు తల్లిదండ్రులు. అయితే ఇక్కడ వాళ్లు గమనించవలసిన విషయం ఏమిటంటే..
 

మీ ఇద్దరు గొడవపడేది మీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే కదా.. కానీ మీ ఇద్దరు గొడవపడటం వల్ల ఆ ప్రభావం మీ బిడ్డల మీద పడుతుందని గ్రహించలేకపోతున్నారు. అలా గొడవపడే బదులు ఇద్దరు కూర్చుని చర్చించుకుని ఇద్దరూ ఒక తీర్మానానికి వచ్చిన తరువాత అప్పుడు పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తే మంచిది..
 

ఏ స్కూల్లో జాయిన్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనే నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం  మీ బంధానికి, మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేలా ఉండాలి. తల్లిదండ్రులు.. ఈ విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించి భవిష్యత్తు వైపు పిల్లలతో కలిసి అడుగులు వేయండి.

Latest Videos

click me!