సురక్షిత శృంగారానికి కండోమ్ బెస్ట్ ఆప్షన్. గర్భం రాకుండా ఉండటమే కాకుండా.. సుఖ వ్యాధులు కూడా రాకుండా ఆపుతుంది.
undefined
సురక్షితమైన శృంగారానికి కండోమ్ ఉపయోగించండి అంటూ ప్రభుత్వాలే స్వయంగా ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే.. కొన్ని కొన్ని సార్లు కండోమ్ వాడినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి.
undefined
కండోమ్ ఫెయిల్ అవ్వడం వల్ల అవాంఛిత గర్భం, ఇతర సుఖ వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. అసలు ఈ కండోమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి..? నాణ్యత లోపమా..? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
undefined
సాధారణంగా కండోమ్ తయారీదారులు... లోపాల్లేని ఉత్పత్తుల్ని అందించడానికే ప్రయత్నిస్తారు. అత్యాధునిక పరికరాలతో అణువణువూ తనిఖీ చేస్తారు. అయినా కొన్నిసార్లు చిల్లుల కండోమ్స్ మార్కెట్‌లోకి వచ్చేస్తుంటాయి.
undefined
ఆ రంధ్రాల్లోంచి వీర్యం బయటికి రావచ్చు. అది గర్భానికీ దారి తీయవచ్చు. కండోమ్ చివరలో ఓ చిన్న సంచి లాంటి బుడిపె ఉంటుంది. స్ఖలనం తర్వాత వీర్యం అక్కడే పోగవుతుంది.
undefined
కండోమ్‌ను తొడుక్కునే సమయంలో ఆ సంచిలాంటి చోట గాలిపోగైపోయే (ఎయిర్‌లాక్) ఆస్కారం లేకపోలేదు. స్ఖలన సమయంలో... తీవ్ర ఒత్తిడి ఏర్పడి ఆ బుడిపె ఠప్పున పగిలిపోయే అవకాశం ఉంది.
undefined
గంటకు నలభై కిలోమీటర్ల నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో వీర్య స్ఖలనం జరుగుతుంది. ఆ వేగాన్ని తట్టుకోవాలంటే కండోమ్‌కు చాలా శక్తి కావాలి.
undefined
తయారీదారులు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నా... ‘ఎయిర్‌లాక్’ కారణంగా... అప్పటికే గాలితో నిండిపోయిన బుడిపె మీద ఇంకాస్త ఒత్తిడి పడుతుంది. దీంతో కండోమ్ ఫెయిల్యూర్స్ జరగుతూ ఉంటాయి.
undefined
సంభోగం లేదా ముఖరతి వంటి ఎలాంటి శృంగార చర్యలో పాల్గొంటున్న మొదటి నుంచి చివరి వరకూ కొత్త కండోమ్ ని ఉపయోగించాలి
undefined
అంగం స్తంభించిన తర్వాతే కండోమ్ ని తొడుక్కోకాలి.
undefined
స్ఖలనం అనంతరం అంగం పూర్తిగా మెత్త బడక ముందే కండోమ్ అంచులు జాగ్రత్తగా నొక్కి పట్టుకుంటూ.. యోని నుంచి బయటకు తీయాలి. వీర్యం ఒలికిపోకుండా దానికి ముడి వెయ్యాలి.
undefined
కండోమ్ వెనుక భాగంలో వీర్యాన్ని నిల్వచేసే తిత్తివంటి బాగం లేనట్లయితే.. కండోమ్ ని పూర్తిగా తొడుక్కోకుండా చివర్లో అరంగుళం మేరకు ఖాళీగా ఉంచాలి.
undefined
ఒకసారి వాడిన తర్వాత మళ్లీ వాడకూడదు. వాడకం తర్వాత ఓక కాగితంలో చుట్టి.. ఇతరులు ఎవరూ కూడా దానిని ముట్టుకునే వీలు లేని చోట పారేయాలి
undefined
శృంగారం మధ్యలో కండోమ్ చినిగినట్లయితే.. రతి క్రీడను మధ్యలోనే ఆపేయడం మంచిదని సూచిస్తున్నారు
undefined