సెక్స్ తో మగాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసా?

First Published | Oct 3, 2023, 1:54 PM IST

రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. శారీరక, మానసిక సమస్యలు దూరమవుతాయి. సెక్స్ పురుషుల్లో..
 

శృంగారంలో పాల్గొనడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరాన్ని తేలిక పరుస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. బాధను కలిగించే విషయాలను దూరం చేస్తుంది. అంతేకాదు అధిక రక్తపోటును తగ్గించి మీ గుండెను బేషుగ్గా ఉంచుతుంది. అలాగే కేలరీలను కరిగిస్తుంది. ఇది అందరికీ తెలుసు. మరి రతిక్రీడ వల్ల పురుషులకు కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే పురుషులు పెద్దగా ఒత్తిడికి గురికారని సైకలాజికల్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మంచి సెక్స్ పురుషుల అలసటను ఇట్టే మాయం చేస్తుంది. ఒత్తిడి, యాంగ్జైటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వైద్యులు చెబుతున్నారు.
 


జననేంద్రియాలు బలోపేతం 

అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే పురుషుల జననేంద్రియాలు బలంగా మారుతాయి. అయితే పురుషులు వయసు పెరుగుతున్న కొద్దీ దూరంగా ఉంటారు. అలాగే వీరి స్టామినా కూడా తగ్గుతుంది. అలాగే జననేంద్రియ భాగాలు కూడా బలహీనంగా మారుతుంటాయి. ఈ అధ్యయనం ప్రకారం.. పురుషులు 40 ఏండ్లు దాటిన తర్వాత శృంగారంలో పాల్గొంటే వారి జననేంద్రియాలు బలపడతాయట. 
 

Sexual Relationship

మెరుగైన నిద్ర

సాధారణంగా పగటిపూట కష్టమైన పనులను చేసే మగవారు రాత్రిళ్లు కంటినిండా నిద్రపోతారు. కానీ ఇప్పుడంతా యాంత్రికంగా ఈ ప్రపంచం మారింది.  అలాగే శారీరక శ్రమ ఎక్కువగా చేసే పురుషుల సంఖ్య కూడా తగ్గింది. కంప్యూటర్, ల్యాప్ టాప్ లో వర్క్ చేసే వారి సంఖ్య పెరిగింది. కూర్చొని ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అంతేకాదు సరిగ్గా నిద్రకూడా పట్టదు. ఇలాంటి పురుషులు తమ భాగస్వామితో అప్పుడప్పుడు  సెక్స్ లో పాల్గొంటే కంటినిండా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos

click me!