సెక్స్ సమయంలో ఎక్కువ నొప్పి వచ్చేవారికి బెస్ట్ పొజీషన్స్ ఇవి..!

First Published | Oct 2, 2023, 2:38 PM IST

సెక్స్ కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు.. శరీరానికి, మనస్సుకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. రెగ్యురల్ గా సెక్స్ లో పాల్గొంటే ఒత్తిడి దూరమవుతుంది. గుండె ఫిట్ గా ఉండటంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొంతమందికి సెక్స్ లో పాల్గొన్నప్పుడు బాగా నొప్పి కలుగుతుంది. ఇలాంటి వారికి కొన్ని సెక్స్ భంగిమలు ఉపయోగపడతాయి. అంతేకాదు ఆనందం కూడా రెట్టింపు చేస్తాయి. 
 

సెక్స్ శారీరక ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చాలా మంది సెక్స్ లో పాల్గొన్న తర్వాత గాఢంగా నిద్రపోతారు. ఎందుకంటే దీనివల్ల శరీరం అలసిపోయి నిద్రపడుతుంది. దీంతో మీరు రీఫ్రెష్ అవుతారు. నిజానికి సెక్స్ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచుతుంది. ఒక్కటేమిటీ దీనితో బోలెడు శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొంతమందికి సెక్స్ లో పాల్గొంటే అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది. ఇది సెక్స్ పొజీషన్స్ వల్లే కావొచ్చంటున్నారు నిపుణులు. అయితే కొన్ని సెక్స్ భంగిమలు ఇలాంటి నొప్పినేం కలిగించవు. అలాగే మీరు మరింత ఆనందాన్ని పొందేలా చేస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

స్పూనింగ్ పొజిషన్

స్పూనింగ్ పొజీషన్ కూడా సెక్స్ లో నొప్పిని గానీ, అసౌకర్యాన్ని గానీ కలిగించదు. ఈ భంగిమలో వెనుక భాగం నుంచి సెక్స్ లో పాల్గొంటారు. నిజానికి ఈ పొజీషన్ తక్కువ నొప్పిని మాత్రమే కలిగిస్తుంది. కానీ మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. కాబట్టి సెక్స్ లో నొప్పి ఉండే దంపతుల్లో మరింత ఆనందాన్ని పొందడానికి ఈ పొజీషన్ ను ట్రై చేయొచ్చు. 
 


స్టాండింగ్ పొజిషన్

పేరులోనే ఉంది స్టాండింగ్ అని. అంటే దీనిలో నిలబడి శృంగారంలో పాల్గొంటారు. ఈ సెక్స్ భంగిమ మగవారు, ఆడవాళ్లు ఇద్దరిలో నొప్పి కలిగే అవకాశం తక్కువ. ఇది దంపతులకు కంఫర్ట్ కూడా ఉంటుందని చెబుతారు. 
 

టాక్సీ పొజీషన్

ఈ పొజీషన్ కూడా దంపతులకు కంఫర్ట్ గా ఉంటుంది. ఇది కూడా ఎలాంటి నొప్పిని గానీ, అసౌకర్యాన్ని కానీ కలిగించదు. ఈ భంగిమలో పురుషుడి ఒడిలో స్త్రీలు కూర్చొని శృంగారంలో పాల్గొంటారు. అయితే ఈ పొజీషన్ లో పురుషులకు కాళ్లలో కొద్దిగా నొప్పి కలుగుతుంది. కానీ ఆడవాళ్లకు ఎలాంటి నొప్పి ఉండదు. ఇలాంటి అనేక ఇతర రకాల భంగిమలను ట్రై చేసినప్పుడు జంటలు ఎక్కువ ఆనందాన్ని పొందే అవకాశం ఉందంటున్నారు.

Latest Videos

click me!