Relationship: భాగస్వామిపై ఫిర్యాదు చేయకండి.. సంసారాన్ని ఇలా చక్కదిద్దుకోండి!

First Published | Aug 26, 2023, 2:15 PM IST

 Relationship: సాధారణంగా సంసారంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారు. అలాకాకుండా ఇద్దరూ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే సమస్య తేలిగ్గా తీరిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
 

భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. అయితే ఆ గొడవలని చాలా తేలిగ్గా పరిష్కరించుకోవలసిన వాటిని కూడా ఇగోలకి పోయి మరింత పెద్దది చేసుకుంటారు. ఆ వాదన ఆ సంబంధం ముగిసిపోవటానికి కూడా అప్పుడప్పుడు కారణం అవుతుంది.
 

కాబట్టి ముందుగా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు చేసే మొట్టమొదటి తప్పు కంప్లైంట్లు చేసుకోవటం. నీవల్లే జరిగింది అంటూ తప్పుని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టివేయటం. ఇలా చేయడం వల్ల సమస్య తీరదు సరి కదా సమస్య మరింత పెరుగుతుంది.
 


అందుకే సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం. ముందుగా సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా వాదులాడుకోకుండా ముందు ప్రశాంతంగా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోండి. సమస్య ఎక్కడ మొదలైందో గ్రహించండి. ఎవరివల్ల తప్పు ఉంటే వారు నిజాయితీగా క్షమాపణ చెప్పండి.
 

అలాంటి తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడండి. మీకు తెలియని విషయాల మీద మీ భాగస్వామి దగ్గర సలహాలు తీసుకోవడానికి ఎలాంటి మొహమాటం పడకండి. అదే సమయంలో తప్పుని కపిపుచ్చటానికి ప్రయత్నించి ఎదుటి వాళ్ళ మీద కేకలు వేయకండి. బంధంలో నిజాయితీ చాలా అవసరం.
 

ఈరోజు మీరు నిజాయితీగా లేనప్పుడు రేపటి రోజున మీ భాగస్వామిని నిలదీసే హక్కు ని కోల్పోతారు. అలాగే ఎదుటివాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినండి. ఒకవేళ తప్పు జరిగింది అనిపిస్తే కోప్పడకుండా అవతలి వాళ్ళకి సరైన సలహా ఇవ్వండి. ఎదుటివాళ్ళు తప్పు చేసినప్పుడు కోపంతో వాళ్ళని సరిదిద్దడం కన్నా ప్రేమతో సరిదిద్దరం చాలా సులువైన పని అని గ్రహించండి.
 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాదన అవసరం అనుకుంటే కచ్చితంగా చాలా తక్కువ మాట్లాడండి ఎందుకంటే ఆవేశంలో ఉన్నప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా మనసు ఆవేదన చెందుతుంటే ధ్యానంలో కూర్చోండి. ధ్యానం చేసిన తర్వాత తీసుకునే నిర్ణయంలో ఒక పరిణితి ఉంటుంది.

Latest Videos

click me!