Relationship: మీ బంధం బోర్ కొడుతుందా.. అయితే ఓసారి ఇలా ప్రయత్నించండి?

First Published | Jun 27, 2023, 2:00 PM IST

Relationship: సాధారణంగా ఒక బంధం పాతబడుతున్న కొద్దీ బంధం లో ఉన్న మాధుర్యం తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ బంధం నిత్యం సరికొత్తగా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 

కొత్తగా పెళ్లి అయినా జంటల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడం, పదిమందిలో ఉన్నా వాళ్ళిద్దరే మాట్లాడుకోవడం, కలిసి పనులన్నీ చక్కబెట్టుకోవడం ఇలా ఎక్కడ చూసినా ఇద్దరు కలిసే కనిపిస్తారు. ప్రతి చిన్న అకేషన్ ని సెలబ్రేట్ చేసుకుంటారు.
 

కానీ రాను రాను అదంతా రొటీన్ అయిపోవడంతో బంధాన్ని బోర్ గా ఫీల్ అవుతారు. మొదట్లో పార్ట్నర్ మీద ఉన్న క్యూరియాసిటీ, వాళ్లని ఇంప్రెస్ చేయాలనే ఉత్సాహం మెల్ల మెల్లగా తగ్గు ముఖం పడతాయి. దీనిని ఇలాగే వదిలేస్తే బంధం నిస్తేజంగా మారిపోతుంది. అలాకాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ బంధాన్ని ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంచుకోవచ్చు.

Latest Videos


ఆ చిట్కాలు ఏంటో చూద్దాం రండి. మీకు ఎప్పుడైతే బంధం మీద విసుగు పుడుతుందో అప్పుడు మీ తొలి రోజులని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ఒకరిని ఇంప్రెస్ చేయడానికి మరొకరు ఎలా తాపత్రయ పడేవారో గుర్తు చేసుకోండి. ఇది మిమ్మల్ని మధురమైన స్మృతి లోకి తీసుకు వెళుతుంది.
 

మిమ్మల్ని సన్నిహితంగా ఉంచడానికి మరియు దానిని పునరుద్ధరించడానికి ఒక మంచి మార్గం. ఇక రిలేషన్ బోర్ కొట్టడానికి మరొక కారణం రొటీన్ లవ్ మేకింగ్. అవునండి ఎప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా మీ భాగస్వామి యొక్క కల్పనాలను మరియు కోరికలను అన్వేషించండి.
 

ఇది లైంగిక స్పార్క్ ను సజీవంగా ఉంచడంలో సహాయం పడుతుంది మీ సంబంధం మెరుగుపడేలాగా చేస్తుంది. మీ బంధాన్ని పటిష్టం చేసే మరొక పద్ధతి విహారయాత్రకి వెళ్లి రావటం నిజమేనండి ఇద్దరు ఒత్తిడిని, బాధ్యతలని పక్కనపెట్టి చిన్న విహారయాత్రకి వెళ్లి రండి.

మీరు మీ భాగస్వామితో ఒంటరిగా గడిపినప్పుడు మధుర స్మృతులు గుర్తు చేసుకోవటం వలన కొత్త విషయాలను అనుభవిస్తారు. చిన్న చిన్న గిఫ్ట్లని ఇచ్చి పుచ్చుకోవటం, చిన్నచిన్న సర్ప్రైజ్లు ప్లాన్ చేయటం వల్ల కూడా బంధం మరింత దగ్గరవుతుంది. సో ఇలా ప్రయత్నించి చూడండి. బోర్ అనే పదానికి బోర్ కొట్టి మీ నుంచి దూరంగా పారిపోతుంది.

click me!