మీ భర్తను మీ ప్రేమలో పడేయాలంటే ఏం చేయాలి..?

First Published | May 28, 2022, 2:25 PM IST

మన వారికి.. మన సొంతమైన వారికి కూడా కొన్ని పదాలను చెప్పి వారిని మరింత సంతోషంగా ఉంచవచ్చట. భర్తను సంతోషంగా ఉంచడంతో పాటు.. మీ భర్త మిమ్మల్ని అమితంగా ప్రేమించేలా చేసుకోవాలి అంటే.. ఈ టిప్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది. 

భార్య భర్తల మధ్య బంధం అన్యోన్యంగా సాగాలంటే వారి మధ్య ప్రేమ కచ్చితంగా ఉండాలి. దాదాపు భార్యభర్తలందరి మధ్య ప్రేమానురాగాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పెళ్లి అయిపోయింది కదా అని దానిని వ్యక్త పరచరు. నిజానికి ప్రేమను సమయానుసారం వ్యక్తీకరించనప్పుడే వారి బంధం బలంగా ఉంటుందట. బయటివారికే థ్యాంక్సులు, సారీలు చెప్పాలని రూల్ ఏమీ లేదు. మన వారికి.. మన సొంతమైన వారికి కూడా కొన్ని పదాలను చెప్పి వారిని మరింత సంతోషంగా ఉంచవచ్చట. భర్తను సంతోషంగా ఉంచడంతో పాటు.. మీ భర్త మిమ్మల్ని అమితంగా ప్రేమించేలా చేసుకోవాలి అంటే.. ఈ టిప్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది. మరి అవేంటో ఓసారి చూద్దామా..

1.ఐ లవ్ యూ.. అనే ఈ మూడు పదాలకు చాలా శక్తి ఉందట. కేవలం ప్రేమలో ఉన్నవారు మాత్రమే కాదు.. పెళ్లి తర్వాత కూడా ఈ పదాలతో మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. మీ భర్తకు రోజులో కనీసం ఒక్కసారైనా ప్రేమగా లవ్ యూ చెప్పాలి. దానితో పాటు... కాసేపైనా రొమాంటిక్ గా మాట్లాడాలి.
 


Love Life

2. మనం చాలా సార్లు చిన్న విషయాలే కదా అని పక్కన పెట్టేస్తాం. కానీ... చిన్న విషయాలే జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మీరు మీ భర్త కోసం చేసే చిన్న పని కూడా.. వారి కి మీకున్న ప్రేమను తెలియజేస్తుంది. వారు ఆనందపడతారు. కాబట్టి.. అలాంటివాటిని నిర్లక్ష్యం చేయకండి.

Image: Still from the serial

3.మీ భర్త పట్ల మీకు అటెన్షన్ ఉండేలా చూసుకోవాలి. రోజులో అతనితో గడపడానికి ప్రయత్నించండి. అతనికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టడం.. ఆయనకు నచ్చినట్లుగా ఉండటం చేయాలి. సరదాగా మీ భర్తతో గడపడానికి ప్రయత్నించాలి.

4. ప్రతి విషయంలో అతనికి మీరు తోడు ఉంటున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉండాలి.  వారు ఏదైనా విషయంలో డల్ గా ఉంటే.. పాజిటివ్ గా మాట్లాడి ప్రోత్సాహం నింపాలి. మీ భర్తను ప్రేరేపించేలా మాట్లాడాలి. వారికి మీరు అన్నారు అని అర్థమయ్యేలా మీరు ధైర్యం నింపాలి.

Latest Videos

click me!