భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా... భార్యలు ఇవి చేయకూడదు..!

First Published | May 28, 2022, 12:20 PM IST

భర్త విషయంలో కొన్ని ఎవాయిడ్ చేయాలట. ముఖ్యంగా తమను తాము తెలివిగల వారుగా భావించే ప్రతి మహిళ.. భర్త విషయంలో ఇవి చేయకూడదట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

Relationship Tips-

ఏ మహిళ అయినా.. తమ భర్తను అమితంగా ప్రేమిస్తుంది. చాలా మంది తమ భర్తే సర్వస్వంగా బతుకుతూ ఉంటారు. అయితే.. భర్త అంటే ఎంత ప్రేమ ఉన్నా... భార్యలు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలట. 

Relationship-

భర్త విషయంలో కొన్ని ఎవాయిడ్ చేయాలట. ముఖ్యంగా తమను తాము తెలివిగల వారుగా భావించే ప్రతి మహిళ.. భర్త విషయంలో ఇవి చేయకూడదట. మరి అవేంటో ఓసారి చూద్దాం..
 

Latest Videos


Distance Relationship

చాలా మంది మహిళలు తమ భర్తను విపరీతంగా ప్రేమిస్తారు. అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే... ఆ ప్రేమతో... భర్తకు అవసరానికి మంచి సేవలు చేస్తూ ఉంటారు. వారు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి చేయడం మంచిది కాదట.

Relationship

భార్యభర్తల మధ్య విబేధాలు రావడం చాలా సహజం. అయితే... దంపతుల మధ్య గొడవలకు ఎవరిదో ఒకరిది తప్పు కావచ్చు. తప్పు  చేసింది మీ భర్త అయితే...  మీరు క్షమించవచ్చు. ఒక్కసారైతే క్షమించి వదిలేయవచ్చు. కానీ తరచూ వారు తప్పులు చేయడం.. మీరు క్షమించడం కామన్ గా జరుగుతున్నాయి అంటే... కష్టం. తరచూ తప్పులు చేయడం వారి నిజమైతే.. మీరు వారిని క్షమించడం కరెక్ట్ కాదు.

Relationship

భర్తతో భార్యలు సమయం గడపాలని  ఉవ్విల్లూరుతూ ఉంటారు. అందులో తప్పులేదు. కానీ... మరీ ఎక్కువగా సమయం గడపడం కూడా కరెక్ట్ కాదట. అలా చేయడం వల్ల.. మీకు వారు మాత్రమే సర్వస్వమని.. వారు లేకపోతే మీరు బదకలేరు అనే భావనకు వచ్చేస్తారట.

Relationship tips

మహిళలు తమ భర్త, పిల్లలు, కుటుంబం, ఉద్యోగం వంటి వాటిపై దృష్టి పెట్టి.. తమ గురించి తాము పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. కాబట్టి... తమపై తాము దృష్టి పెట్టుకోవడం, ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయం పై దృష్టి పెట్టడం మానుకోవద్దు

Relationship tips

చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత.. భర్తే లోకంగా బతుకుతూ ఉంటారు. అందులో తప్పులేక పోవచ్చు.. కానీ.. తమ ఐడెంటిటీని పూర్తిగా మర్చిపోతూ ఉంటారు. అలా చేయకుండా.. తమ ఐడెంటిటీని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించుకోవాలి.

Relationship Goals

ఇక.. చాలా మంది పెళ్లి తర్వాత.. భర్త సంపాదిస్తున్నాడు కదా అని.. వారు సంపాదనపై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ... మహిళలు.. తమను తాము ఆర్థికంగా నిలపెట్టుకోవాలి. ఆర్థిక విషయాలపై ఇతరులపై ఆధారపడటం మానేయాలి. 

Relationship Goals

ఇక  చాలా మంది మహిళలు ఎమోషనల్ గా, మెంటల్ గా ఇతరులతో కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలా కనెక్ట్ అయ్యే వ్యక్తి కేవలం మీ లైఫ్ పార్ట్ నర్ మాత్రమే అయ్యి ఉండాలి అనే విషయాన్ని గుర్తించుకోవాలి.

Relationship Goals

ఇక చాలా మంది అన్ని విషయాల్లో... తమ పార్ట్ నర్ ని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అలా పూర్తిగా గుడ్డిగా నమ్మేయడం కూడా అంత మంచిది కాదట. 

click me!