విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు అనడానికి సంకేతాలు ఇవే...!

First Published | Nov 4, 2022, 1:54 PM IST

కొందరు విడాకుల వైపు అడుగులు వేయవచ్చు. కొందరు తెలీకుండానే విడాకులు తీసుకోవాలనే ఆలోచన తెచ్చుకుంటారు. 

దాంపత్య జీవితం సజావుగా సాగాలని అందరూ కోరుకుంటారు. అయితే... అందరూ కోరుకున్నట్లు జీవితాలు ఉండకపోవచ్చు. కొందరు దంపతుల మధ్య ఈక్వేషన్ సరిగా లేకపోయినా సర్దుకుపోయి బతికేస్తూ ఉంటారు. 

కానీ.. కొందరు విడాకుల వైపు అడుగులు వేయవచ్చు. కొందరు తెలీకుండానే విడాకులు తీసుకోవాలనే ఆలోచన తెచ్చుకుంటారు. దంపతులు విడాకులు వైపు అడుగులు వేస్తున్నారు అనే విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా ముందే గుర్తించవచ్చట. అవేంటో ఓసారి చూద్దాం...


1.దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే ఒకరిపట్ల మరొకరికి గౌరవ మర్యాదలు ఉండాలి. కానీ... అలా గౌరవ మర్యాదలు లేకుండా కేవలం పగ పెంచుకుంటున్నారు అంటే... వారు త్వరలో విడాకులు తీసుకుంటున్నారని అర్థం. దంపతుల మధ్య గౌరవం అనేది చాలా ముఖ్యం. ఒకరి ఆలోచనలకు మరొకరు విలువ ఇవ్వడం కూడా ముఖ్యం. అలా ఇవ్వడం ఆపేశారంటే.. వారు త్వరలో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లే.

2.దాంపత్య జీవితంలో దంపతుల మధ్య రొమాన్స్, శృంగారం కీలక పాత్ర పోషిస్తాయి. ఎంత పెద్ద గొడవనైనా రొమాన్స్ తో దూరాన్ని తగ్గించవచ్చు. అలా కాకుండా సెక్స్ పరంగా దంపతులు ఆసక్తి చూపించకుండా.. ఒకరిని మరొకరు దరం పెడుతున్నారు అంటే వారు.. విడిపోవాలి అని నిర్ణయించుకున్నట్లే అర్థం

divorce

3.దంపతులు.. తమ జీవితాన్ని కలిసి ముందుకు తీసుకువెళ్లాలి అనుకుంటే... వారి ఆర్థిక విషయాల గురించి  చర్చించుకుంటారు. ఒకరి కోసం మరొకరు సేవింగ్స్ దాచి పెడతారు. కానీ అలా కాకుండా.. ఆదాయాన్ని మరిచి ఖర్చులు ఎక్కువగా పెడుతున్నారు అంటే వారు భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని అర్థం. అంటే..వీరు కూడా విడాకుల వైపు అడుగు వేస్తున్నారని అర్థం.

4.పెళ్లి తర్వాత ఏం చేసినా.. దాదాపు తమ పార్ట్ నర్ తో కలిసి చేయాలనే అనుకుంటారు. పార్టీలకు వెళ్లినా, ఏదైనా టూర్ కి వెళ్లినా.. వారు మాత్రమే వెళుతూ... ప్రతి విషయంలో పార్ట్ నర్ ని దూరం పెడుతున్నారంటే కూడా ఆలోచించాల్సిందే. వారు తమ పార్ట్ నర్ ని వదిలేయాలని నిర్ణయం తీసుకున్నట్లేనని అర్థం చేసుకోవాలి.


5.భార్యభర్తల మధ్య వాదనలు రావడం చాలా సహజం. ఒక్కోసారి ఒక్కో విషయం గురించి వాదించుకుంటున్నారంటే పర్లేదు. కానీ... ఫలితం తెలిసినా.. ఎదుటివారి సమాధానం తెలిసినా కావాలని ఒకే విషయంపై వాదించుకుంటున్నారంటే.. వారు విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లే.

6.దంపతుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అయితే... మరీ చిన్న చిన్న విషయాలకే.. ఇద్దరిలో ఒకరు సర్దుకున్నా సమసిపోయే సమస్యల గురించి కూడా కావాలని గొడవ పడుతున్నారంటే వారు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లే.

7. దంపతులు ఇద్దరూ కలిసే ఉన్నప్పటికీ... ఒంటరిగా ఉన్న భావన కలుగుతున్నా.. వారు విడాకులకు తమను తాము సిద్దం చేసుకున్నట్లే లెక్క.

Latest Videos

click me!