Valentine's week 2022: ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే..!

First Published | Feb 8, 2022, 11:43 AM IST

 మీ పెట్ లేదా వారి పెట్ కి మెడలో ఓ చిన్న బో పెట్టి.. దానిలో సీక్రెట్ గా లవ్ లెటర్ పెట్టి.. వారి వద్దకు పంపించండి. ఇలా చేయడం వల్ల.. సులభంగా మీరు మీ ప్రేమను వారికి తెలియజేయవచ్చు. 

వాలైంటైన్ వీక్ వచ్చేసింది. నిన్న రోజ్ డే కూడా పూర్తైంది. ఇక ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే.. ప్రపోజ్ డే ఈరోజు. ఈ ప్రపోజ్ డే రోజున.. చాలా మంది తమ ప్రేమ విషయాన్ని.. తాము ప్రేమించిన వ్యక్తికి తెలియజేయాలని ఆశపడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే జరుపుకుంటారు. మరి ఏ విధంగా ప్రపోజ్ చేస్తే.. మనం ప్రేమించిన వారు మన ప్రేమను యాక్సెప్ట్ చేస్తారో తెలుసుకోవాలని ఉందా..?  ఇదిగో ఈ కింది విధంగా ప్రపోజ్ చేస్తే.. ఎవరైనా ఇట్టే ఫిదా అయిపోతారు.

మీకు పెంపుడు జంతువు ఉన్నా.. లేదంటే.. మీరు ప్రేమించిన వారికి పెట్ ఉన్నా.. ప్రపోజ్ చేయడం చాలా సులువు. మీ పెట్ లేదా వారి పెట్ కి మెడలో ఓ చిన్న బో పెట్టి.. దానిలో సీక్రెట్ గా లవ్ లెటర్ పెట్టి.. వారి వద్దకు పంపించండి. ఇలా చేయడం వల్ల.. సులభంగా మీరు మీ ప్రేమను వారికి తెలియజేయవచ్చు. 
 



ముందుగా మీరు ఎక్కడ ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు అనే విషయం పై క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో పూలు, చిన్న చిన్న లైట్స్ తో అందంగా అలంకరించి.. అది మీరు ప్రేమించిన వ్యక్తి కంటపడేలా చేయాలి. అక్కడ ప్రపోజ్ చేసింది మీరు అనే విషయం అర్థమయ్యేలా జాగ్రత్తపడాలి

మీరు ప్రేమించిన వ్యక్తి  చూసేలా.. మ్యాగ్నెట్ లెటర్స్ ని ఫ్రిడ్జ్ కి అంటించండి.  ఇప్పుడు  ఇలాంటి మ్యాగ్నెట్ లెటర్స్ మార్కెట్లో సులభంగా దొరుకుతున్నాయి. అయితే.. మీరు  అది వారికంట పడేలా  చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీమీద మాత్రమే ఉంది.

మీరు ప్రేమించిన వ్యక్తికి పేపర్ చదివే అలవాటు ఉంటే..  మీ ప్రపోజల్ ని.. న్యూస్ పేపర్ లో వేసి.. అది వారు చూసేలా చేయాలి. ఇలా కూడా మీరు మీ ప్రేమను చాలా డిఫరెంట్ గా తెలియజేయవచ్చు.

Image: Getty Images

మీరు ప్రేమించిన వ్యక్తికి పజిల్స్ చేయడం ఇష్టమైతే.... వారికి స్పెషల్ గా లవ్ పజిల్ ఇవ్వండి. దానిని వారు పూర్తి చేస్తే.. వారికి మీ ప్రేమ విషయం తెలిసేలా ఆ పజిల్ చేసి వారికి ఇవ్వండి.

మీరు ప్రేమించిన వ్యక్తికి.. ఉదయం, సాయంత్రం వాకింగ్ కి వెళ్లే అలవాటు ఉండి ఉంటే.. వారు వాకింగ్ కి వెళ్లే దారిలో.. వారికి కనపడేలా లవ్ ప్రపోజ్ చేయాలి. అక్కడ లైట్స్, లేదంటే.. ఏదైనా పోస్టర్ కట్టడం లాంటివి చేయడం వల్ల మీ ప్రేమను తెలియజేయవచ్చు.

Latest Videos

click me!