ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు పెళ్లికి సెట్ అవ్వరు తెలుసా?

First Published | Nov 8, 2022, 2:08 PM IST

నిజంగా పెళ్లికి కావాల్సిన క్వాలిటీలు మనకు ఉన్నాయా లేదా అని చూసుకోరు. ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు అసలు పెళ్లికి సెట్ అవ్వరో ఓసారి చూద్దాం...
 


ప్రతి ఒక్కరూ ఒక వయసు రాగానే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే... వయసు ఒక్కటే పెళ్లికి కావాల్సిన అర్హత కాదు. అంతకు మించిన అర్హతలు ఉండాలి. చాలా మంది పెళ్లి అనగానే తమ జీవితంలోకి రావాల్సిన వారికి ఈ క్వాలిటీలు ఉండాలి... ఆ క్వాలిటీలు ఉండాలి అని అనుకుంటారు. కానీ... నిజంగా పెళ్లికి కావాల్సిన క్వాలిటీలు మనకు ఉన్నాయా లేదా అని చూసుకోరు. ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు అసలు పెళ్లికి సెట్ అవ్వరో ఓసారి చూద్దాం...
 

1. ఆందోళన కలిగించేవారు...

తమ జీవిత భాగస్వామి కి నిత్యం ఏదో ఒక విషయంలో ఆందోళన కలిగిస్తున్నారు అంటే వారు పెళ్లికి సెట్ అవ్వరనే అర్థం. తమ జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు ఆనందం ఉండాలి కానీ.... టెన్షన్ ఉండకూడదు. ప్రతి విషయంలో తమను నమ్ము అని మీరు మీ పార్ట్ నర్ కి చెప్పాల్సి వస్తుంది అంటే... వారితో మీ జీవితం అంత కరెక్ట్ గా ఉండదని అర్థం. ఆ వ్యక్తి అలాంటివాడు అని పెళ్లికి ముందే అర్థమైతే వారితో పెళ్లి కొనసాగించకపోవడమే ఉత్తమం. ఎందుకంటే... అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు పెళ్లికి సెట్ కారు. 
 


2.ముందే ఎక్కువగా ఆలోచించేవారు..

ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నాడట. ఇలా ముందే అన్ని విషయాలను అతి త్వరగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు కూడా పెళ్లికి సెట్ కారు. అన్ని విషయాలకు చాలా త్వరగా కమిట్ అయ్యేవారిని ఎంచుకోవడం నిజంగా తెలివైన ఎంపిక కాదు.

marriage new

3.తమ గురించి మాత్రమే ఆలోచించేవారు...

ఎదుటి వ్యక్తి ఎలా చచ్చినా.. తమ గురించి మాత్రమే ఆలోచించేవారు కొందరు ఉంటారు. అలాంటి స్వార్థపరులు.. పెళ్లి తర్వాత కూడా మారతారు అనుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి... అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు కూడా తొందరగా పెళ్లికి సెట్ అవ్వరు. స్వార్థపరులతో  జీవితాంతం సంతోషంగా ఉండలేరు.

4.ఎక్కువగా విమర్శించేవారు...

మీ భాగస్వామి మిమ్మల్ని నిరంతరం విమర్శిస్తూ, ఎగతాళి చేస్తుంటే, మీరు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచిస్తారా? ఈ రకమైన వ్యక్తులు చాలా విమర్శనాత్మకంగా ఉంటారు. మీ ఆత్మగౌరవాన్ని కూడా తగ్గిస్తూ ఉంటారు, మీ స్వంత సామర్థ్యాలను , విలువను మీరు ప్రశ్నించేలా చేస్తుంది.
 

5.ఎప్పటికీ తప్పు చేయని వాడు

మీ భాగస్వామి ఎప్పుడూ నీతి గురించి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే.. అతను ఎప్పుడూ తప్పు చేయడు, అలాంటి వ్యక్తితో జీవించడం చాలా కష్టం. వారు చేయరు కాబట్టి.. ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు.

6.అతిగా స్పందించేవారు...

ప్రతి సందర్భంలోనూ అతిగా స్పందించి అనవసరమైన డ్రామాలు సృష్టించే వ్యక్తి ఖచ్చితంగా పెళ్లి కి సెట్ అవ్వరు. మీ భాగస్వామి అతిచిన్న వాదన వద్ద పల్టీలు కొట్టినట్లయితే, ముఖ్యమైన చర్చల విషయంలో వారు మీ మాటలను ఓపికగా వింటారనే గ్యారెంటీ లేదు.

Latest Videos

click me!