జీవితాంతం కలిసి ఉండాలనే కోరికతోనే ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. కానీ... అందరూ తమ జీవితాన్ని చివరి వరకు కొనసాగించలేరు. కొందరు మధ్యలోనే విడిపోవడం లాంటివి చేస్తుంటారు. కొందరు కలిసి ఉన్నా.. వారి మధ్య ప్రేమ పెద్దగా ఉండదు. కానీ... జీవితాంతం ప్రేమతో ముందుకు సాగే దంపతులు కూడా ఉంటారు. వారి సీక్రెట్స్ ఏంటో ఓసారి చూద్దాం...
happy couple life
1. ఎంత ప్రేమ ఉన్నా.. దంపతుల మధ్య గొడవలు జరగడం చాలా కామన్. జీవితాంతం ప్రేమగా ఉండే దంపతుల మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి. అయితే.... వారు చిన్న చిన్న విషయాలకు, అర్థం పర్థం లేని వాటికి గొడవలు పడరట. వారి మధ్య ఏదైనా గొడవ జరిగితే అది చాలా మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. వారు దేనిమీద గొడవ పడితే... దాని మీద మాత్రమే ఫోకస్ పెడతారు. పాత విషయాలను తవ్వి తవ్వి మాట్లాడుకోరు.
Image: Getty Images
2. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా.. ఎవరైతే తమ జీవిత భాగస్వామిని ప్రోత్సహించిస్తారో వారు.. జీవితాంతం ఆనందంగా ఉంటారు. తమ ప్రొఫెషనల్ జీవితంతో పాటు... తమ జీవిత భాగస్వామి భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు.
3.తమ జీవిత భాగస్వామి విషయంలో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండటం చాలా గొప్ప విషయం, తమ జీవిత భాగస్వామికి పూర్తిగా మద్దతు ఇచ్చేవారు... జీవితాంతం ఆనందంగా కలిసి ఉంటారు.
Image: Getty Images
4.ప్రేమ మనసులో ఉంటే సరిపోదు. దానిని తమ భాగస్వామికి వ్యక్త పరచడం కూడా తెలియాలి. అలా తెలియజేసే దంపతులు.. జీవితాంతం ఆనందంగా కలిసి ఉంటారు.
Image: Getty Images
5.చాలా మంది దంపతులు తమ పార్ట్ నర్ చేసిన పనికి స్కోర్ ఇస్తూ ఉంటారు. అలా ప్రతి పనికీ లెక్కలు వేసుకోవడం.. అలా చేయలేదు.. ఇలా చేయలేదు అని తిట్టుకోవడం కరెక్ట్ కాదు. అలా చేయకుండా.. ఇద్దరూ కలిసి పని చేసుకునే దంపతులు ఆనందంగా ఉంటారు.
love, couple
6.సరదాగా నవ్వుకోవడం ఎవరైనా కోరుకుంటారు. అయితే... ఆ ఆనందం జీవిత భాగస్వామి నుంచి వస్తే.. వారి బంధం ఆనందంగా ఉంటుంది. ఎవరైనా తాము నవ్వుతూ.. తమ పార్ట్ నర్ ని కూడా మనస్ఫూర్తిగా నవ్విస్తూ ఉంటారో... అలాంటివారు జీవితాంతం ఆనందంగా ఉంటారు.
7.మీరు మీ జీవితభాగస్వామి కోసం అవసరమైతే చిన్న చిన్న త్యాగాలు చేయడంలో ఎలాంటి తప్పులేదు. అలా చసేవారు జీవితాంతం ఆనందంగా ఉంటారు. అయితే... అది మనస్ఫూర్తిగా ఉండాలి.