చలికాలంలో హనీమూన్ కు వెళ్లడానికి బెస్ట్ ప్లేస్ లు ఇవే..

First Published | Dec 28, 2023, 11:16 AM IST

పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇక పెళ్లి తర్వాత హనీమూన్ కు ఖచ్చితంగా వెళ్తుంటారు. అయితే మన దేశంలో కూడా ఈ చలికాలంలో హనీమూన్ కు వెళ్లడానికి బెస్ట్ ప్లేస్ లు చాలానే ఉన్నాయి. అవేంటంటే.. 

పర్ఫెక్ట్ రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్ ఎంచుకోవడం అంత సులువేమీ కాదు. అయితే చాలా మంది హనీమూన్ కు సిమ్లా-మనాలీ, రాజస్థాన్ వంటి ప్లేసెస్ కు వెళుతుంటారు. అయితే మీరు వేరే ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే గనుక ఈ ఆర్టికల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. మనదేశంలోనే బెస్ట్ రొమాంటిక్ హనీమూన్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

లాచెన్,  తంగు లోయ

సిక్కిం ఉత్తర భాగంలో ఉన్న ఈ ప్రదేశం నిజంగా మీ హనీమూన్ ను చిరస్మరణీయంగా చేస్తుంది. ఇక్కడికి వెళ్లిని అనుభూతిని మీరు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా గుర్తుండిపోతుంది. ఈ తంగు లోయ 3950 మీటర్ల ఎత్తులో 13000 అడుగుల ఎత్తులో ఉంటుంది. గురుడోంగ్మార్ సరస్సు, చోప్టా సరస్సుకు వెళ్లే మార్గంలో మీరు ఈ లోయను చూడొచ్చు. అక్టోబర్ నుంచి మార్చి నెలల్లో ఈ ప్లేస్ స్వర్గాన్ని తలపిస్తుందంటే నమ్మండి.


పొద్దు పొద్దున్నే పర్వతం మీద నుంచి తెల్లని మంచు పర్వతాన్ని చూస్తే ఇది కలా? నిజమా? అన్నట్టే ఉంటుంది. ఈ ప్రదేశం చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్నప్పటికీ.. భారతీయులను మాత్రమే సందర్శనకు అనుమతిస్తారు. ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చోప్తా గ్రామానికి కూడా మీరు వెళ్లొచ్చు. తంగు లోయలో పైకి వెళ్తే చెట్ల వరుసల అద్భుత దృశ్యం కనివిందు చేస్తుంది. 
 

10 honeymoon spots in karnataka

తవాంగ్

తవాంగ్ హిమాలయాలలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ ప్రదేశం దాని సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వానికి ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ నగరంలో తవాంగ్ మఠం ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద మఠం. అలాగే ఆరో దలైలామా జన్మస్థలం. తవాంగ్ సందర్శనకు ఉత్తమ సమయం చలికాలం. 

ప్రకృతి అందాలకు, పర్యాటక కేంద్రానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మీరు హనీమూన్ కోసం ఇక్కడకు వెళ్లాలనుకుంటే మీరు గోరిచెన్ శిఖరం, సెలా పాస్, తవాంగ్ మొనాస్టరీ, నురానాంగ్ జలపాతం వంటి ప్రదేశాలను తప్పక సందర్శించండి. 

డార్జిలింగ్

హనీమూన్ కు ఇంతకంటే మంచి ప్రదేశం ఏముంటుంది చెప్పండి. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కూడా తమ హనీమూన్ ను ఇక్కడే జరుపుకున్నారట. మీరు సిమ్లా-మనాలీ పర్వతాలకు దూరంగా ఒక ప్రత్యేక ప్రదేశంలో హనీమూన్ జరుపుకోవాలనుకుంటే.. ఎంచక్కా డార్జిలింగ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. చల్లని వాతావరణం హనీమూన్ కు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అదుకే మీకు డార్జిలింగ్ బాగా నచ్చుతుంది. డార్జిలింగ్ లోని ఎత్తైన శిఖరం 'టైగర్ హిల్' ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.

Latest Videos

click me!