పడక గదిలో కాన్ఫిడెన్స్ పెంచుకునేదెలా?

First Published | Aug 24, 2022, 1:36 PM IST

ముందు మీ శరీరాన్ని మీరు ప్రేమించాలి. మిమ్మల్ని మీరే ప్రేమించలేనప్పుడు.. మరొకరు ఎలా ప్రేమిస్తారు..? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటేనే కలయిక సమయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉండగలరు. 

కలయికలో ఎంజాయ్ చేయాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే.. ఈ కలయికను పూర్తిగా ఆస్వాదించాలంటే.. అందులోనూ పాల్గొనే ఇద్దరికీ దానిపై కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతేకాదు.. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. కాగా.. చాలా మందికి కలయికలో పాల్గొనాలనే కోరిక, తమ భాగస్వామిపై నమ్మకం ఉన్నప్పటికీ... పడకగదిలోకి అడుగుపెట్టిన తర్వాత తమ కాన్ఫిడెన్స్ ని కోల్పోతున్నారట. ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఏం చేయాలో నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
 

కలయికను ఆస్వాదించాలి అనుకునేవారు.. ముందుగా తమను తాము ప్రేమించుకోవాలి. తమపై తమకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే.. ఏదైనా చేయగలరు. ఈ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. కాబట్టి.. మీ శరీరం ఎలా ఉన్నా.. ముందు మీ శరీరాన్ని మీరు ప్రేమించాలి. మిమ్మల్ని మీరే ప్రేమించలేనప్పుడు.. మరొకరు ఎలా ప్రేమిస్తారు..? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటేనే కలయిక సమయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉండగలరు. అంతేకాకుండా.. అద్భుతంగా కలయికను ఆస్వాదించగలరు.


అడగనిది అమ్మ అయినా అన్నం పెట్టదు అనే సామేత వినే ఉంటారు. కలయిక సమయంలోనూ అంతే. మీరు నోరు విప్పనంత వరకు మీరు కోరుకునేది మీ పార్ట్నర్ కి అర్థం కాదు. మీకు సెక్స్ విషయంలో ఏమి కావాలో.. మీరే స్వయంగా మీ పార్ట్ నర్ కి తెలియజేయాలి. అంతేకాదు... మీ పార్ట్ నర్ కి ఏం కావాలో కూడా మీరే అడిగి తెలుసుకోవాలి. మీకు ఏం కావాలో మాత్రమే కాదు.. ఎప్పుడు కావాలని అనిపిస్తుందో కూడా మీరే మీ భాగస్వామికి తెలియజేయాలి. మీకు ఏదైనా విషయం ఇబ్బంది పెడితే అది కూడా వారికి తెలియజేయాలి.
 

చాలా మంది సెక్స్ ని కేవలం చీకటి గదిలోనే చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి రూల్ ఏమీ లేదు. మీకు ఎలా నచ్చితే అలా చేయవచ్చు. మీకు లైట్ ఉంటే ఇష్టమైతే అలానే చేయాలి. లేదంటే.. డిమ్ లైట్ లో చేస్తే.. మూడ్ వస్తుందంటే అలానే చేయాలి. అది కూడా కాదు అంటే.. మీ బెడ్రూమ్ లో కాస్త దూరంగా.. రెండు కొవ్వత్తులను వెలిగించండి. ఆ వెలుతురులో కలయిక కూడా కొత్త మజా ఇస్తుంది. కాన్ఫిడెన్స్ తక్కువ అని భావించేవారికి ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది.
 

ఏ క్షణంలోనైనా సంగీతం ఉత్తమమైనది. సెక్స్ విషయానికి వస్తే.. మరింత సహాయపడుతుంది. ఎలాంటి మూడ్ అయినా సెట్ చేస్తుంది. అందుకే.. కలయికలో పాల్గొనే సమయంలో.. మీకు నచ్చిన మ్యూజిక్ ని ప్లే చేసుకోండి. దానిని వింటున్నప్పుడు మీకు మరింత రొమాంటిక్ గా అనిపిస్తుంది.

ఇక.. కలయికలో పాల్గొనడానికి ముందు.. మీకున్న సెక్స్ భయాల గురించి కూడా మీ భాగస్వామితో మాట్లాడాలి. మీకు ఏమైనా ఫాంటసీలు ఉన్నాయేమో మీ పార్ట్ నర్ కి తెలియజేయండి. మీ అలవాట్లను వారికి వివరించండి. వారికి మీ గురించి తెలిస్తే.. మీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు.
 

Latest Videos

click me!