పనులు చిన్నవే.. ఇంప్రెషన్ పెద్దది..!

First Published | Aug 23, 2022, 12:17 PM IST

చిన్న చిన్న విషయాలకే మీ ఎమోషన్స్ ని బయట పెట్టకూడదు.తద్వారా ఇతరులు మిమ్మల్ని బలహీనమైన వ్యక్తిగా చూడలేరు. తమ ఎమోషన్స్ పై కంట్రోల్  ఉన్నవారు.. ఎప్పుడైనా గొప్పవారుగా కనపడతారు.
 

Image: Still from the serial

పుట్టుకతోనే ఎవరికీ గౌరవం దక్కదు. మనం చేసే పనులను చూసి ఇతరులు మనల్ని గౌరవిస్తూ ఉంటారు. మనం చేసే కొన్ని పనులు మన గౌరవాన్ని పెంచితే.. మరి కొన్ని పనులు.. మన గౌరవాన్ని మరింత దిగజార్చుతాయి. అయితే.. మనల్ని అందరూ గౌరవించాలన్నా.. అందరికీ మన పై మంచి ఇంప్రెషన్ ఉండాలి అంటే.. చిన్నవైనా కొన్ని పనులు చేయాలట. అవేంటో ఓసారి చూద్దాం...

ప్రతి ఒక్కరికీ ఎమోషన్స్ ఉంటాయి. అయితే.. ఆ ఎమోషన్స్ ని  చాలా మంది వెంటనే భయపెట్టేస్తూ ఉంటారు. కానీ.. మీ భావోద్వేగాలను సాధారణంగా కంటే ఎక్కువగా వ్యక్తీకరించడానిక ఇష్టపడితే.. ఇతరులు మిమ్మల్ని బలహీనంగా చూసే అవకాశం ఉంది. కాబట్టి.. చిన్న చిన్న విషయాలకే మీ ఎమోషన్స్ ని బయట పెట్టకూడదు.తద్వారా ఇతరులు మిమ్మల్ని బలహీనమైన వ్యక్తిగా చూడలేరు. తమ ఎమోషన్స్ పై కంట్రోల్  ఉన్నవారు.. ఎప్పుడైనా గొప్పవారుగా కనపడతారు.


మన రూపం, మనం ధరించే దుస్తులు కూడా ఒక్కోసారి గౌరవాన్ని తీసుకువస్తాయట.  అందుకే.. సందర్భాన్ని బట్టి దుస్తులు వేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే.. మీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది.

జీవితంలో పైకి రావాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే.. తమ లక్ష్యం కోసం కష్టపడే వారికి కూడా గౌరవం ఎక్కువగా లభిస్తుందట. అలా లక్ష్యం కోసం కష్టపడేవారిని చూసినప్పుడు.. ఇతరులలోనూ ప్రేరణ కలుగుతుందట. అందుకే.. ఈ లక్షణం ఉన్నవారిని అందరూ ఎక్కువగా ఇష్టపడతారు.
 

ఇక చాలా మంది పరిచయమైన వెంటనే.. తమ గురించి మొత్తం చెప్పేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల  వారి పట్ల ఇతరులు ఆసక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి... మన గురించి మొత్తం వెంటనే అందరికీ చెప్పేయకూడదు. కాస్తో కూస్తో.. రసహ్యంగా ఉంచడం ఉత్తమం.

కొందరు.. తమతో ఉన్నవారిని తరచూ పొగొడ్తూనే ఉంటారు. అలా పొగడటం వల్ల.. మీ పొగొడ్త విలువ తగ్గిపోతుంది. అలా కాకుండా... నిజంగా.. వారిని మెచ్చుకోవాలి అనిపించినప్పుడు మనస్పూర్తిగా, నిజాయితీ గా మెచ్చకుంటే.. మీ పొగడ్త విలువ పెరగడంతో పాటు.. మీ మీద గౌరవం కూడా పెరుగుతుంది. 


ఎలాంటి పరిణామాలు ఎదురైనా అందరి ముందు తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పే వ్యక్తిని అందరూ గౌరవిస్తారు, మెచ్చుకుంటారు. అలా చేయడానికి ధైర్యం కలిగి ఉండటం మాత్రమే ప్రజలు నిజంగా ప్రశంసించగల ప్రశంసనీయమైన లక్షణం.

Latest Videos

click me!