పడకగదిలో రెచ్చిపోవాలా..? శృంగారానికి ముందు పాటించాల్సిన టిప్స్ ఇవే..

First Published Feb 24, 2020, 3:16 PM IST

ఇక చాలా మంది శృంగారంపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ... అది రియల్ లైఫ్ లో చూపించలేకపోతున్నారట. ఎంత ఆసక్తి ఉన్నా...  పడక గదిలో ఫెయిల్ అయిపోతున్నామని నిరుత్సాహ పడిపోతున్నారు.
 

శృంగారమంటే ఆసక్తి లేని ఈ సృష్టిలో ఎవరూ ఉండరు. అయితే.. కొందరు బహిరంగంగానే దీని గురించి చర్చించడానికి ముందుకు వస్తే... మరికొందరు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించారు.
undefined
పడక గదిలో ఎంత రెచ్చిపోయినా... నలుగురి ముందు మాట్లాడటానికి సిగ్గుపడతారు. అది తమ వ్యక్తిగత విషయంగా భావిస్తారు. అందులో ఎలాంటి తప్పులేదు.
undefined
అయితే... కొన్నిసార్లు.. ఎదైనా సమస్య ఉంటే... నలుగురికి కాకపోయినా.. జీవిత భాగస్వామితోనైనా చర్చించుకోగలిగేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
undefined
తమ పార్ట్ నర్ ఎలా ఉండాలి? ఎలా శృంగారాన్ని తాము ఎక్కువ ఆస్వాదిస్తాము లాంటి విషయాలు దంపతులు చర్చించుకోవడంలో ఎలాంటి తప్పులేదని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఇక చాలా మంది శృంగారంపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ... అది రియల్ లైఫ్ లో చూపించలేకపోతున్నారట. ఎంత ఆసక్తి ఉన్నా... పడక గదిలో ఫెయిల్ అయిపోతున్నామని నిరుత్సాహ పడిపోతున్నారు.
undefined
దీంతో జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి? ఎలా మెప్పించాలి? అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ, నిస్పృహలో తమలో పెంచుకున్నారు.
undefined
ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ యుగంలో.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడపడమే గగనమైపోయింది. దొరికిన కాస్తో, కూస్తో సమయంలోనే పార్టనర్ ని మెప్పించాలి. అందుకు ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.
undefined
చాలా మంది సెక్స్ లో పాల్గొనడానికి ముందు పవర్ ఫుల్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు. అదేమీ అంత మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. శుభ్రంగా స్నానం చేస్తే చాలని..  దుర్వాసన రాకుండా ఉంటే సరిపోతుందని అంటున్నారు. మీకు నచ్చిన పర్ఫ్యూమ్ వాసన మీ భాగస్వామికి నచ్చాలని లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు.
undefined
చాలా మంది యోగా, వ్యాయామం వంటి వాటికి దూరంగా ఉంటారు. అయితే.. రోజూ ఓ అరగంట పాటు ఏరోబిక్స్ చేస్తే.. మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. పురుషులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. టెస్టోస్టిరాన్ స్థాయి పెరిగి శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
undefined
శృంగారానికి మందు అతిగా ఆహారం తీసుకోకూడదు. దాని వల్ల అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. అియతే.. డార్క్ చాక్లెట్లు మాత్రం నిరభ్యంతరంగా తినొచ్చని చెబుతున్నారు.
undefined
డార్క్ చాక్లెట్స్.. ప్రేమ భావాలను పెంపొందిస్తోంది. అయితే అలా అని ఎక్కువ మొత్తంలో తినకూడదు. తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కాబట్టి కొద్ది మొత్తంలో తీసుకుంటే సరిపోతుంది. రాత్రి వేళల్లో  శాచ్యురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి.
undefined
అప్పుడప్పుడు శరీరానికి మసాజ్ చేయించుకోవడం లేదా ఆవిరి స్నానం చేయడం వల్ల రక్త సరఫరా మెరుగై, శరీరం శృంగారానికి సమాయత్తమవుతుంది.
undefined
ఇక అంతేకాకుండా... రాత్రి సమయంలో శృంగారం తర్వాత ఎవరిదారిన వాళ్లు పడుకోకుండా.. దాని గురించి చర్చించుకోవాలని సూచిస్తున్నారు. దంపతులిద్దరూ చర్చించుకోవడం వల్ల శృగారాన్ని మరింత ఆస్వాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
undefined
అంతేకాదు.. శృంగారం విషయంలో దంపతుల మధ్య ఎక్కువ కాలం గ్యాప్ కూడా రావడం మంచిదికాదని చెబుతున్నారు. చిన్న చిన్న గొడవలు దంపతుల మధ్య రావడం సహజమే. అయితే.. వాటి కారణంగా ఎక్కువ కాలం పడకగదిలో దూరం మాత్రం పెంచకూడదంటున్నారు.
undefined
కనీసం వారానికి మూడు సార్లు అయినా శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు వర్క్ , ఆఫీస్ టైమింగ్స్ కారణంగా, అందులోనూ పిల్లలు ఉంటారు ఇలా కారణాలు ఏవైనా చాలా మందికి కుదిరే అవకాశం ఉండదు. అలాంటివారు కనీసం వారానికి ఒక్కసారైనా తమకంటూ ఏకాంతం సృష్టించుకోవాలని సూచిస్తున్నారు.
undefined
అంతేకాకుండా.. ఎక్కువ శాతం భార్యను పొగడటం మరిచిపోవద్దని చెబుతున్నారు. ఆడవారికి వారి అందాన్ని పొగిడితే చాలా ఇష్టం. అందులోనూ భర్త.. రొమాంటింక్ గా ఉన్నప్పుడు తన అందాన్ని గుర్తిస్తే.. ఆమె మరింత ఆనందాన్ని మీకు అందించగలదు.
undefined
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బెడ్ మీదకు వెళ్లగానే.. ముందుగా కార్యంలోకి దిగకూడదని హెచ్చరిస్తున్నారు. ఫోర్ ప్లేతో మొదలుపెట్టి.. ఆ తర్వాత అసలు కార్యానికి వెళ్లాలని సూచిస్తున్నారు.
undefined
అంతేకాకుండా.. శృంగారం కన్నా ఎక్కువగా స్త్రీలు భర్త ప్రేమను ఆస్వాదిస్తారు. ఆ ప్రేమ మీరు ముద్దులతో వారికి చూపించొచ్చు. ఇరువురు ఒకరిపై మరొకరు తమ ప్రేమను ముద్దుల రూపంలో చూపించుకుంటే.. మరింత ఎక్కువ ఎంజాయ్ చేయగలరని చెబుతున్నారు.
undefined
మరో విషయం ఏమిటంటే.. ప్రేమ, శృంగారంలో దంపతులు ఇద్దరిలో ఏ ఒక్కరూ సెల్ఫిష్ గా ఉండకూదని.. కొన్ని సార్లు త్యాగాలు కూడా తీయని అనుభూతిని ఇస్తాయని చెబుతున్నారు.
undefined
click me!