శృంగారంలో ఏజ్ బారు ... ఎంత తక్కువ చెబితే.. అంత ఎక్కువ!

First Published Feb 22, 2020, 2:39 PM IST

వాటర్‌లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల 40-60 ఏళ్ల వయసువారిలో శృంగార ధోరణులపై ఒక అధ్యయనం చేసి మరీ దీన్ని గుర్తించారు. అసలు వయసుతో పోలిస్తే మానసికంగా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని మరింత బాగా ఆస్వాదిస్తున్నట్టు తేల్చారు. 

శృంగారం దివ్యౌషధం లాంటిది. దానివల్ల ఎన్నో రోగాల నుంచి ముప్పును తప్పించుకోవచ్చని పరిశోధనల్లో నిరూపితమైంది. శృంగారంలో పాల్గొనడం వల్ల కేవలం లైంగిక ఆనందం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుందనే సంగతి తెలిసిందే.
undefined
అయితే.. చాలా మంది వయసు పెరుగుతున్న కొద్దీ.. శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుందని భావిస్తుంటారు. అందులో ఎంత మాత్రం నిజం ఉందో లేదో తెలీదుగానీ... వయసు తక్కువగా చెప్పడం వల్ల మాత్రం శృంగారాన్ని బాగా ఆస్వాదించేస్తారట.
undefined

Latest Videos


నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజమని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది వయసు ఎంత అనగానే.. ఒకటి లేదా రెండు సంవత్సరాలు తక్కువగా చెప్పుకుంటారు.
undefined
అదేమీ అబద్ధం చెప్పాలనే ఇంటెన్షన్ తో కాదు.. మనం ఇంకా చిన్నే.. పెద్దగా వయసేమీ అయిపోలేదు అనే భావనతో అలా చెబుతుంటారు. అయితే.. ఆ భావనే శృంగారంలో దూసుకోవడానికి సహకరిస్తుందంటున్నారు.
undefined
వాటర్‌లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల 40-60 ఏళ్ల వయసువారిలో శృంగార ధోరణులపై ఒక అధ్యయనం చేసి మరీ దీన్ని గుర్తించారు. అసలు వయసుతో పోలిస్తే మానసికంగా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని మరింత బాగా ఆస్వాదిస్తున్నట్టు తేల్చారు.
undefined
అంటే దీనర్థం ఇలాంటివాళ్లు ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటున్నారని కాదు. శృంగారానుభూతి విషయంలో చాలా ఆనందాన్ని పొందుతున్నారనే. వయసుతో పాటు వచ్చే దీర్ఘకాల సమస్యలను పరిగణనలోకి తీసుకొని చూసినా కూడా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదిస్తుండటం విశేషం.
undefined
వయసు తక్కువని భావించేవారు సహజంగానే చురుకుగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివీ వీరిలో ఎక్కువే. ఇవన్నీ బలమైన లైంగిక వాంఛలు కలగటానికి, శృంగారాన్ని ఆనంద సాధనంగా భావించటానికి పురికొల్పుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
undefined
ఇక ఈ సంగతి పక్కన పెడితదే... శృంగారం వల్ల మనం ఊహించని ఎన్నో లాభాలు ఉన్నాయి. రోజూ రతి క్రీడలో పాల్గొనడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఒత్తిడి తగ్గడంతోపాటు కేలరీలు కరగడానికి కూడా కలయిక దోహదం చేస్తుంది.
undefined
రొమాన్స్ వల్ల రోగాలను తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. జలుబు జ్వరం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
undefined
లైంగిక ఆస్వాదన వల్ల ఆక్సిటోన్ హార్మన్ స్థాయిులు ఐదు రెట్లు పెరుగుతాయి. ఫలితంగా నొప్పులు తగ్గుముఖం పడతాయి. లైంగిక ఆనందాన్ని పొందడం వల్ల భావప్రాప్తి సమయంలో డీహైడ్రో యిపియాండ్రోస్టిరోన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.
undefined
ఇది ఇమ్యూనిటీని పెంచి కణాలను రిపేర్ చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వారానికి రెండుసార్లు రతిలో పాల్గొన్నవారు కొన్ని వారాలకు ఒకసారి శృంగారాన్ని ఆస్వాదించే వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట.
undefined
రతి క్రీడలో పాల్గొనడం వల్ల ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయిలు పెరగుతాయి. ఫలితంగా కండరాలు ఎముకలు గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
undefined
click me!