రిలేషన్ షిప్ లో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. అరమరికలు లేకుండా.. ఉండాలని చెబుతారు. అయితే, మీ సంబంధాన్ని దెబ్బతీసే ఆలోచనల గురించి ఏమిటి? వాటిని పంచుకోవడం వల్ల మీ అనుబంధానికి కలిగే హాని మాటేమిటి? అందుకే కొన్ని విషయాలు అనిపించిన.. బైటికి చెప్పకపోవడమే..మంచిది.
undefined
అయితే దీనివల్ల మీ అనుబంధానికి హాని ఏమీ ఉండదు. చెప్పడం వల్ల కలిగే హాని కంటే.. చెప్పకపోవడం వలన కలిగే మేలు ఎక్కువ. అవేంటో చూడండి...
undefined
రోజు మొత్తంలో మీ భాగస్వామి చేసే చిన్న చిన్న పనులు మీకు చికాకుగా అనిపించవచ్చు. కానీ మీ అనుబంధం దృఢంగా ఉన్నంతకాలం ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. వాటిని చెప్పడం వల్ల అనవసరపు గొడవలు, అపోహలు వస్తాయి. దానికంటే.. రహస్యంగా ఉంచడమే మంచిది.
undefined
మీ మునుపటి రిలేషన్ షిప్ కు సంబంధించిన ఫీలింగ్స్ ఇంకా ఉంటే వాటిని చెప్పకపోవడమే మంచిది. ఇప్పుడు మీ ఎక్స్ ఏం చేస్తున్నారో తెలిసి.. ఆశ్చర్యపోయి.. చర్చించడం అంత మంచి విషయం కాదు.
undefined
అంతగా చర్చించదలుచుకుంటే మీ భాగస్వామితో చర్చించే బదులు, సన్నిహితులు, స్నేహితుల దగ్గర మాట్లాడడం మంచిది. ఎందుకంటే వారు విషయాలను అర్థం చేసుకుంటారు.
undefined
ఇక మీ పార్టనర్ తరఫు కుటుంబ సభ్యుల గురించి మీకేమైనా నచ్చని విషయాలు ఉంటే పంచుకోవాల్సిన పనిలేదు. అవి మరీ మీ అనుబంధానికి హాని చేస్తున్నాయి అనిపిస్తే తప్ప పట్టించుకోనవసరం, తనతో చర్చించాల్సిన అవసరం లేదు. దీనిగురించి మీ భాగస్వామితో చమత్కరించవచ్చు, సరదాగా మాట్లాడొచ్చు.. కానీ అవమానకరంగా మాట్లాడకూడదు.
undefined
రిలేషన్ లో ఉన్నా లేకపోయినా.. వ్యక్తుల మీద ఆకర్షణ సహజమే. మీకు మీ భాగస్వామి స్నేహితులు ఆకర్షణీయంగా అనిపిస్తే.. దాన్ని అంతవరకే ఉంచేయండి. తనతో చర్చించవద్దు. ఇది తనలో అసూయ, అభద్రత కలిగించి మీకు, తనకు ఇబ్బందికరంగా మారుతుంది.
undefined
మీ అనుబంధం మీద మీకు సందేహాలు ఉంటే.. వెంటనే తనతో మాట్లాడకండి.. దాని గురించి బాగా ఆలోచించండి. ఆ తరువాత అవసరం అనుకుంటేనే తనతో చర్చించండి.
undefined
వారి గోల్స్ ను, ఇష్టాయిష్టాల్ని ఎప్పుడూ గౌరవించండి. అంతేకానీ అది మీకు ఇష్టం లేదని చెప్పడం, మీ ఆలోచనలప్రకారం నడుచుకోవలనుకోవడం సరికాదు.
undefined
మీ ప్రస్తుత భాగస్వామి విషయంలో మీకు ఏవైనా అసంతృప్తులు ఉన్నా.. వాటిని పెద్దగా బైటికి చెప్పకూడదు. బదులుగా, దానికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించండి.
undefined