ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటాయి. కొన్నింటిని మనం సులభంగా నమ్మేస్తాం. కానీ.. కొన్ని నిజాలు నమ్మడానికి మన మనసు అంగీకరించదు. కానీ నమ్మసక్యం కానివి ఉంటాయి. మరికొన్ని మనకు నవ్వు తెప్పిస్తాయి. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది.
అయితే... తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తన భార్య గర్భవతి అన్న విషయాన్ని అందరితో పంచుకున్నాడు. అది మంచి విషయమే కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. ఆ గర్భానికి కారణం తమ ఇంట్లో ఉన్న ఓ పిల్లి అంటూ చెప్పడం విశేషం.
అతను చెప్పిన విషయం ఎవరికీ మింగుడుపడలేదు. ఇదేలా సాధ్యం. ఒక పిల్లి కారణంగా మహిళ గర్భం ఎలా దాలుస్తుందంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. మరి ఈ పిల్లి కథ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.
ప్రముఖ సోషల్ మీడియా రెడ్డిట్ లో ఓ వ్యక్తి తన భార్య ప్రగ్నెన్సీ గురించి చెప్పాడు. అక్కడితో ఆగలేదు. తన భార్య గర్భానికి తమ ఇంట్లో పిల్లి కారణమంటూ బాంబు పేల్చాడు.
ఈ దంపతులకు ఆల్రెడీ ఓ కుమార్తె ఉంది. అయితే.. వీరు మరో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో.. ప్రెగ్నెన్సీని వాయిదా వేద్దామని అనుకున్నారట.
ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు తన భార్య గర్భనిరోధక మాత్రలు మింగిందట. అయితే.. దాని కారణంగా ఆమెకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలయ్యాయి. దీంతో.. వారు కండోమ్ వాడటం మొదలుపెట్టారు.
కండోమ్ వాడినప్పటికీ.. తన భార్య గర్భం దాల్చిందని అతను చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూసి తాను షాకైనట్లు చెప్పాడు.
అతనికి అస్సలు అర్థం కాలేదు.. కండోమ్ వాడిన తర్వాత కూడా తన భార్య ఎలా గర్భం దాల్చిందా అని తెగ ఆలోచించేశాడు. ఆ తర్వాత తన సరుగులో దాచి ఉంచిన కండోమ్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు గానీ అతనికి అసలు విషయం అర్థం కాలేదు.
విషయం ఏమిటంటే.. ఆ కండోమ్ ప్యాకెట్ లోని కండోమ్స్ ని వాళ్ల పిల్లి కొరికింది. దానిని అతను గమనించలేదు. అది చూసుకోకుండా అదే కండోమ్ ధరించి శృంగారంలో పాల్గొన్నాడు.
దీంతో.. అతని భార్య గర్భం దాల్చింది. అందుకే. తన భార్య గర్భానికి తమ పెంపుడు పిల్లి కారణమైందంటూ అతను పేర్కొన్నాడు. కాగా.. అతని కథ మొత్తం విన్నాక నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోయారు. వీరి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.