సినిమాకి ఏమాత్రం తీసిపోని సచిన్ పైలట్ లవ్ స్టోరీ

First Published | Jul 20, 2020, 2:26 PM IST

సినిమాలలో మాదిరి డ్రామా, ఎమోషనల్ అన్నీ.. ఆయన లవ్ స్టోరీలో జరిగాయి. మరి ఆ స్టోరీ ఏంటో మనమూ ఓ లుక్కేద్దామా..
 

సచిన్ పైలట్... ప్రస్తుత రాజకీయంగా ఎక్కువగా వినపడుతున్న పేరు ఇది. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తనకున్న కొంత మంది ఎమ్మెల్యేల మద్దతుతో తిరుగుపాటు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన బీజేపీలో చేరుతున్నారని.. అందుకే ఇలా చేస్తున్నారంటూ ప్రచారం జరగుతోంది. అయితే.. ఆయన ఇప్పటి వరకు బీజేపీలో చేరకపోయినా.. ఆయన తదుపరి కార్యచరణ ఏమైఉంటుందా అనే ఆసక్తి మొదలైంది.
undefined
ఈ నేపథ్యంలో.. ఆయన రాజకీయ అంశాలతోపాటు.. ఆయన వ్యక్తిగత అంశమైన ప్రేమ, పెళ్లి విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సచిన్ పైలట్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
undefined

Latest Videos


సచిన్ పైలట్ పేరుకి రాజకీయనాయకుడైనా చూడటానికి బాలీవుడ్ హీరోలా ఉంటారు. దీంతో.. ఆయన ప్రేమించి పెళ్లిచేసుకున్నారు అనే సరికి.. ఆ కథపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే.. ఆయన ప్రేమ పెళ్లి అంత సులభంగా ఏం జరగలేదు
undefined
సినిమాలలో మాదిరి డ్రామా, ఎమోషనల్ అన్నీ.. ఆయన లవ్ స్టోరీలో జరిగాయి. మరి ఆ స్టోరీ ఏంటో మనమూ ఓ లుక్కేద్దామా..
undefined
ఆయన ప్రేమకథ.. లండన్ లో ఎంబీఏ చదవడానికి వెళ్లిన సమయంలో మొదలైంది. ఢిల్లీలోని వైమానిక దళం బాల భారతి పాఠశాల నుండి పట్టా పొందిన తరువాత, సచిన్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
undefined
తరువాత ఎంబీఏ చేయడానికి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా కుమార్తె , ఒమర్ అబ్దుల్లా చెల్లెలు సారా అబ్దుల్లాను సచిన్ కలిశారు.
undefined
అక్కడ వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్దిరోజులకే ప్రేమగా మారింది. సచిన్ ఎంబీఏ తర్వాత ఇండియా వచ్చేయగా.. సారా మాత్రం లండన్ లోనే ఉండిపోయారు.
undefined
ఖండాంతరాలు మారినా.. మారి మధ్య ప్రేమ మాత్రం పదిలంగానే ఉండిపోయింది.దేశాల మధ్య దూరం వారి మధ్య లోకి రాలేదు. వేర్వేరు దేశాల్లో ఉన్నా.. వారు తరచూ ఒకరితో మరొకరు ఫోన్, ఈమెయిల్స్ లో టచ్ లోనే ఉండేవారు.
undefined
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దల వద్దకు తీసుకువెళ్లారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. సచిన్ హిందువు కాగా.. సారా ముస్లిం.
undefined
మతాలు వేరు కావడంతో వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను తిరస్కరించాయి.
undefined
కానీ.. వారు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం పెద్దలతో యుద్ధం చేశారు. సారా తండ్రి.. వారి పెళ్లికి ససేమిరా అంగీకరించలేదు. దీంతో.. వీరు తమ ప్రేమను ఎలాగైనా గెలిపించుకోని తీరాలని భావించారు.
undefined
దీంతో.. సారా పెద్దల అనుమతి లేకుండానే వీరు 2004లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి కి సారా కుటుంబసభ్యులెవరూ హాజరుకాలేదు.
undefined
కానీ.. సారాకి.. సచిన్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అండగా నిలిచారు. దీంతో.. వీరి ప్రేమ కథ సుఖాంతమైంది. చాలా కాలం తర్వాత వీరిని సారా కుటుంబం కూడా అంగీకరించడం గమనార్హం.
undefined
ప్రస్తుతం సచిన్, సారా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు అరాన్, బిహాన్. కాగా.. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సచిన్ అభిమతం కాదు... కానీ ఆయన తండ్రి మరణం తర్వాత సచిన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
undefined
click me!