వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు. అయితే.. వివాహానికి అపారమైన బలం, కృషి, అవగాహన, నమ్మకం చాలా అవసరం. ఇవి లేకుండా.. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుందని చెప్పలేం. అయితే... దీని కోసం మనం కనీస ప్రయత్నం చేయాలి. చాలా మంది పెళ్లైన కొంత కాలానికే.. తమకు బోర్ కొట్టేసిందని చెబుతుంటారు. కానీ.. అలా బోర్ కొట్టకుండా ఉండేందుకు.. దంపతులు తమ వంతు ప్రయత్నం చేయాలి. అందుకోసం కొన్ని అలవాట్లను అలవరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి వివాహ బంధం సజావుగా సాగేందుకు దంపతులు ఏం చేయాలో... నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...