Relationship:పడకగదిలో ఓడిపోయామనే భావన కలుగుతుందా?

First Published Aug 16, 2022, 12:21 PM IST

సెక్స్ సమయంలో తమ భాగస్వామిని సంతృప్తి పరచలేనప్పుడు వారు ఎక్కువగా నిరాశ చెందుతారు. సెక్స్ సమయంలో కొంతమంది పురుషులు ఓడిపోయినట్లు భావించడానికి గల కొన్ని కారణాలను ఓ సారి చూద్దాం...

శృంగారం జీవితం ఆనందంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.... మనం కోరుకున్నట్లుగా.. అందరి సెక్స్ జీవితం సజావుగా సాగకపోవచ్చు. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అయితే.. ఒక వ్యక్తి.. తాను ప్రతిరోజూ పడక గదిలో ఓడిపోతున్నాను అనే భావన చెందుతున్నారంటే.. దానికి కారణం ఏంటో కచ్చితంగా ఆలోచించాల్సిందే.

పురుషులు తరచుగా మంచంలో లైంగిక పనితీరుతో బాధపడుతున్నారు. సెక్స్ సమయంలో తమ భాగస్వామిని సంతృప్తి పరచలేనప్పుడు వారు ఎక్కువగా నిరాశ చెందుతారు. సెక్స్ సమయంలో కొంతమంది పురుషులు ఓడిపోయినట్లు భావించడానికి గల కొన్ని కారణాలను ఓ సారి చూద్దాం....

కొంతమంది పురుషులు చాలా తక్కువ సమయంలో క్లైమాక్స్ కి చేరుకుంటారు. అయితే.. వారు తమ భాగస్వామిని తృప్తి చెందకుండా చేస్తున్నామని వారు చాలా ఇబ్బందికి గురౌతారట.  మహిళలు క్లైమాక్స్‌కు కొంత సమయం తీసుకుంటారు కాబట్టి ఎక్కువ కాలం సెక్స్ చేయగలిగే వారు రేసులో గెలుస్తారు. అయితే.. త్వరగా ముగించేవారు.. తాము పడక గదిలో ఫెయిల్ అయినట్లు ఫీలౌతూ ఉంటారు.
 

 
కొందరు పురుషులు.. సెక్స్ లో తాము ఓడిపోయామని ఫీలవ్వరు. కానీ.. తమ జీవిత భాగస్వామి ఎక్కువ సేపు చేయడం లేదని.. తరచూ విమర్శిస్తూ ఉంటే మాత్రం.. తాము పడక గదిలో  ఓడిపోయామనే భావన కలుగుతుంది. తమ లైంగిక తీరు గురించి ప్రతిసారీ విమర్శించడంతో.. వారిపై వారికి అనుమానం కలుగుతూ ఉంటుంది. 

పురుషులు తక్కువ ఆత్మగౌరవం, విశ్వాసంతో బాధపడుతున్నప్పుడు, అది వారి లైంగిక పనితీరును చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తిపై తమపై తమకు విశ్వాసం లేనప్పుడు కలయిక విషయంలోనూ ఎక్కువ సంతృప్తి పరచలేరు. ఈ క్రమంలో వారిలో వారికే.. తాము పడక గదిలో ఓడిపోయామనే భావన కలుగుతుంది.

sex

కొంతమంది పురుషులు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి సెక్స్‌ను అన్వేషించడానికి నిరాకరిస్తారు. వారు తమ సొంత బుడగలో ఉండటానికి ప్రయత్నిస్తారు. మార్పు లేకుండా ఉండే సెక్స్ లో మాత్రమే పాల్గొనాలని అనుకుంటూ ఉంటారు. పురుషులు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి చాలా కష్టపడవచ్చు. అందువల్ల వారి భాగస్వాములు ఒక్కోసారి ఉద్రేకానికి గురవుతారు, ఈ క్రమంలో.. వారు తాము పడకగదిలో ఓడిపోతున్నామా అని ఫీలౌతూ ఉంటారట.

sex

పురుషులు చాలా మంది శీఘ్ర స్కలనంతో బాధపడుతున్నప్పుడు, వారు తమ భాగస్వామిని చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటారు. ఇది చివరికి మానసిక స్థితిని దెబ్బ తీస్తుంది. పురుషులు దీని గురించి మరింత ఆత్రుతగా ఉంటారు. ఈ భయం మాత్రమే వారిని మంచి సమయాన్ని గడపకుండా చేస్తుంది.

sex

sex యుక్తవయస్సులో హస్తప్రయోగం వారి లైంగిక జీవితాన్ని తరువాత ప్రభావితం చేస్తుందని పేర్కొన్న అధ్యయనాలు ఉన్నాయి. పురుషులు తరచుగా సెక్స్ సమయంలో సముచితంగా పని చేయలేకపోవడానికి ఇది ఒక కారణం. ఎక్కువ సార్లు హస్త ప్రయోగంలో పాల్గొంటే.. తర్వాత కలయికలో అంత హుషారుగా పాల్గొనలేరట.

click me!