చిన్నప్పుడు మనకు ఇంట్లో, లేదంటే స్కూల్లో.. మంచి అలవాట్లు, చెడు అలవాట్ల గురించి చెబుతూ ఉంటారు. వాటిని బట్టి.. మనం మంచి ప్రవర్తన నేర్చుకోవాలనే ఉద్దేశంతో వారు అవి మనకు నేర్పిస్తారు. అయితే.. వాటితో పాటు.. మనం మరికొన్ని విషయాల గురించి తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొందరు.. తెలిసో తెలియకో.. కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే.. వాటి వల్ల.. మనతోపాటు.. ఇతరులు కూడా ఇబ్బందిపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి.. ప్రతి ఒక్కరూ అస్సలు మాట్లాడకూడని కొన్ని విషయాలను నిపుణులు మనకు వివరిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..