ఆ ఒక్క అబద్దం వల్ల మీ పార్టనర్‌తో కలిసుండటం కష్టంగా ఉందా.. ఇలా ప్రయత్నించండి!

First Published | Jan 2, 2022, 4:56 PM IST

వివాహ జీవితంలో కలయిక అనేది ఒక  మధురమైన అనుభూతి. రెండు మనసులు ఒక్కటై తనువుల దాహం తీర్చుకోవడమే శృంగారం (Romance). కలయిక అనేది వైవాహిక జీవితంలో ప్రతి జంటకు అద్భుతంగా ఉంటుంది.
 

కానీ కొందరికి బాధను మిగిలిస్తుంది. మోసం, బానిసలవ్వడం వంటి లక్షణాలు ఉంటే ఆ బంధంలో నిరుత్సాహం ఉంటుంది. దీంతో కొన్నిసార్లు విడాకులకు (Divorce) దారితీస్తోంది. ఇక ఈ విషయంపై ఓ అధ్యయనంలో వెలుబడిన ఫలితాల ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
 

బంధంలో కలయికను పూర్తిగా ఆస్వాదించాలంటే ఇరువురి మనసులోనూ ఎలాంటి కల్మషం లేని ప్రేమ (Love) ఉండాలి. ఈ ప్రేమతో కలయికలో పాల్గొంటే వారి మధ్య ఎన్ని అపార్ధాలు ఉన్నా తొలగిపోతాయి. కల్మషం లేని ప్రేమ వారి లైంగిక జీవితాన్ని (Sex life) కూడా ఆనందంగా మారుస్తుంది. అయితే వివాహబంధంలో చాలామంది శృంగారానికి బానిసలవుతున్నారు.
 


దీంతో ఇది రిలేషన్ షిప్ (Relationship) లో ఒక విధంగా నిరుత్సాహన్ని (Depression) కలిగిస్తోంది. దీంతో భాగస్వాముల మధ్య మాటలు తగ్గిపోయి వారి మధ్య దూరం పెరిగిపోతోంది. వైవాహిక బంధంలో అన్నింటికీ ప్రధాన ప్రాముఖ్యతను ఇవ్వాలి. కానీ కొందరు మాత్రం శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దానికి బానిసలవుతున్నారు.
 

ఇలాంటి వారు భాగస్వామి మనసుకు ప్రాధాన్యత ఇవ్వరు. వారు చేసిన అన్ని తప్పులను కప్పిపుచ్చుకోవడానికి శృంగార (Romance) అనే కార్యాన్ని అడ్డుపెట్టుకుంటారు. వారు చేసే తప్పులను (Mistakes) ఒప్పుకోకుండా ఆ కార్యంతో భాగస్వామి మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామికి ఇష్టం లేకపోయినా ఆమెతో కలవడానికి ప్రయత్నిస్తారు.
 

మనస్ఫూర్తిగా ఆమెను క్షమించమని అడగరు. ఆమె మనసులోని బాధను అర్థం చేసుకోరు.అన్నింటికీ శృంగారంతోనే జవాబిచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ కార్యం కోసం భాగస్వామితో కాసేపు ప్రేమగా ఉన్నా శృంగారంలో పాల్గొన్న తర్వాత మరల తమ నిజస్వరూపాన్ని (Realism) బయటపెడతారు. కానీ ఇది సరైనది కాదు వారి కోరికలను (Desires) తీర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని అర్థం.
 

ఇలా మోసపూరితమైన మనస్తత్వం కలిగిన భాగస్వామితో జీవితాన్ని పంచుకోవడం తన పార్టనర్ కు నరకంగా ఉంటుంది. బంధానికి ప్రాధాన్యం (Preference) ఇవ్వని వ్యక్తితో ఆ కార్యంలో పాల్గొన్నందుకు భాగస్వామి మనసు ఒత్తిడికి (Stress) గురవుతుంది. ఆ కార్యానికి ఇచ్చే ప్రాధాన్యత తనకు ఇవ్వలేదని బంధానికి ప్రాధాన్యత ఇవ్వ లేని వ్యక్తితో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడదు.
 

తననుంచి బంధాన్ని పెంచుకోవడమే సరైనదని భావిస్తుంది. తన నుంచి విడాకులు తీసుకోవడం ఉత్తమమని అనుకుంటుంది. వివాహ బంధం కేవలం శృంగారానికి మాత్రమే పరిమితం (Limited) కాదు. ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వారి అన్ని భావోద్వేగాలను (Emotions) పంచుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తేనే బంధం అనేది బలపడుతుంది. బంధంలో కేవలం శృంగారానికే ప్రాధాన్యం ఇచ్చే పార్ట్నర్ తో కలిసి ఉండడం కష్టమే.

Latest Videos

click me!