ఫెంగ్ షుయ్ టెక్నిక్స్ తో సంతోషాకరమైన దాంపత్య జీవితం!

First Published | Jan 2, 2022, 4:21 PM IST

దాంపత్య జీవితంలో (Marital life) సంతోషంగా ఉండడానికి ఆలుమగల మధ్య ప్రేమానురాగాలతో పాటు ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ఇంటిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ (Positive energy) దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుందని ఫెంగ్ షుయ్ టెక్నాలజీ చెబుతోంది. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ప్రేమానురాగాలు పెరిగి  దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా  ఫెంగ్ షుయ్ చిట్కాల గురించి తెలుసుకుందాం..
 

మనం నివసించే ఇంటిని దైవంగా భావిస్తాం. అలాగే ఇంటిలో సానుకూల ప్రభావం ఉండాలంటే తప్పక మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ఇవి ఇంటి వాతావరణంలో పాజిటివ్ శక్తిని పెంచుతాయి. దీంతో ఇంటిలో నివాసముండే దంపతుల మధ్య ప్రేమ (Love) బంధం మరింత బలపడి వారి జీవితం సంతోషంగా (Happy) ఉంటుంది.

ఆలుమగలు కాపురం ఉండే పడక గదిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వారి దాంపత్య జీవితానికి మంచిది. ఫెంగ్ షుయ్ టెక్నాలజీ (Feng Shui Technology) ప్రకారం అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పడక గదిని శుభ్రంగా ఉంచుకోవాలి (Keep clean). పడక గదిలో వస్తువులను చిందరవందరగా ఉంచరాదు.
 


చిందరవందరగా (Cluttered) వుంచిన వస్తువులను చక్కగా అమర్చుకోవాలి. ఈ విధంగా చేస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మంచాన్ని మూలలకు దగ్గరగా ఉంచరాదు. గోడకు ఆనించి పెట్టరాదు. అన్ని వైపులా నుండి దిగడానికి వీలుగా ఉండాలి. ఇలా చేస్తే పడక గదిలో సానుకూల శక్తి ఏర్పడుతుంది.
 

పడకగదిలో మంచాన్ని (Bed) తలుపుకు (Door) ఎదురుగా ఉంచరాదు. పడుకునే సమయంలో పాదాలను తలుపు వైపు చూపించి నిద్రించరాదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు ఏర్పడవు. మీ జీవన ప్రయాణం సాఫీగా సాగిపోతుందట. సీలింగ్ ఫ్యాన్ కింద మంచాన్ని ఉంచరాదు.
 

అలాగే మంచానికి ఎదురుగా అద్దం (Mirror) ఉండకూడదు. ఇలా ఉంటే దాంపత్య జీవితంలో ఒత్తిడిలో (Stress) మార్పుకు కారణమట. మంచం కింద పాత వస్తువులను (Old items), పాడైపోయిన వస్తువులను (Damaged items) ఉంచరాదు. ఇలా చేస్తే వివాహిత జంటకు మంచిది కాదట.
 

పడక గది అనేది దంపతుల ఏకాంత  సమయానికి సంబంధించినది కనుక భాగస్వామితో నిద్రించే సమయంలో తలుపులు తెరిచి ఉంచరాదు. పడకగదిలో టీవీ, రేడియో, టెలివిజన్ వాటిని ఉంచరాదు. ఇవి ఉంటే దాంపత్య జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
 

పడకగదిలో అక్వేరియంను (Aquarium) ఉంచకూడదు. దీని కారణంగా చెడు ఆలోచనలు (Bad thoughts) వచ్చే అవకాశం ఉంటుంది. పడకగదిలో ప్రేమకు గుర్తు అయినా పూలను నైరుతి మూలలో ఉంచడం మంచిది.

పెద్ద ఆకులు కలిగిన మొక్కలను, పూల మొక్కలను పడక ఉంచుకోవచ్చట. అలాగని ముళ్ళలు కలిగిన మొక్కలను ఉంచరాదు. పడక గదిలో రొమాంటిక్ మూడ్ (Romantic mood) ను పెంచే రంగులను (Colors) ఎంచుకోవడం మంచిది. ఎరుపు, పింక్ కలర్ లను వాడటం మంచిది.

Latest Videos

click me!