కెరీర్ విషయంలో రాజీ..
కెరీర్ విషయంలో అబ్బాయిలు అస్సలు రాజీ పడరు. అమ్మాయిలు మాత్రం పరిస్థితుల వల్ల రాజీ పడుతుంటారు. పెళ్లైన తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యత, ఆఫీసు పనులన్నింటీని చూసుకోలేక కెరీర్ విషయంలో రాజీ పడటమే బెటర్ అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇది తప్పుడు నిర్ణయమని ఫీలవుతుంటారు. ఎందుకంటే చిన్న చిన్న అవసరాలకు కూడా భర్త లేదా కుటుంబంపై ఆధారపడాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఇలా చేశానా అని బాధపడాల్సి వస్తుంది. మీరు పై చదువులు చదివి, ఉద్యోగం కోసం కష్టపడితే మాత్రం ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. అయితే ఆడవాళ్లు ఇళ్లు, ఆఫీసు పనులను చేయడానికి సిద్దంగా ఉన్నా.. భర్త లేదా కుటుంబం వీళ్లు ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చూస్తుంటారు. అందుకే ఇలాంటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. వారితో వాదనలు, కొట్లాటలకు దిగకుండా ఉద్యోగం చేయడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో వారికి చెప్పండి.