భార్య భర్తల బంధం మొదలైనప్పుడు వారి భావాలు ఒకలా ఉంటాయి. అప్పుడు బాధ్యత లేని సంసారం వారికి స్వేచ్ఛతో కూడిన బంధంతో ఉంటారు. అదే బంధం నడివయసులోకి వచ్చేసరికి బంధం అదే కానీ బాధ్యతలతో కూడి ఉంటుంది.
అప్పటి ఆలోచన విధానం అనుభవంతో కూడి ఉంటుంది. అందుకే నడివయసులో ఉన్న స్త్రీలు భర్తల నుంచి ఏం కావాలనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. వీరు ఎక్కువగా తన భర్త నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనే మాటని వినటానికి ఎక్కువగా ఇష్టపడతారు అది వయసు పైబడినా సరే.
అసలు ఈ వయసులోనే భార్యకి ఆ మాట ఎక్కువసార్లు చెప్పాలి. ఎందుకంటే బాధ్యతలతో అలసిపోయిన స్త్రీకి ఆ మాట మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే భర్త తనను చూసి గర్వపడాలని కోరుకుంటుంది నడివయసు మహిళ. అలాంటి ఒక అభినందన భర్త నుంచి కోరుకుంటుంది.
అలాగే బాధ్యతలతో సతమతమైన భార్య నువ్వు చాలా బాగున్నావు, నువ్వు దొరకడం నా అదృష్టం అనే మాటలు వినటానికి ఎంతో ఇష్టపడుతుంది. ఒక భర్తగా మీరు ఈ మాటలు మీ భార్యతో చెప్పి చూడండి. ఆ తర్వాత మీ భార్యలో వచ్చే హుషారుకి మీరే ఆశ్చర్యపోతారు.
అలాగే ఒక భార్య తన భర్త నుంచి మర్యాద ఆశిస్తుంది. పిల్లల ముందు గానీ ఇతరుల ముందుగాని తనని మర్యాదగా చూసుకోవటాన్ని ఇష్టపడుతుంది స్త్రీ. ఒక భర్తగా అలా చేయడం అవసరం కూడా ఎందుకంటే భర్త భార్యకి విలువ ఇవ్వకపోతే..
కుటుంబ సభ్యులు ఎవరు విలువ ఇవ్వరు అనేది వాస్తవం. ఇక ఒక స్త్రీ ఏ వయసులో ఉన్నప్పటికీ తన భర్త మరొక స్త్రీ గురించి మంచిగా మాట్లాడటం, పొగుడుతూ మాట్లాడటం భరించలేదు కాబట్టి వీలైనంత వరకు పక్క ఆడవాళ్ళ ప్రస్తావన రాకుండా చూసుకోండి.