మీరెంత ప్రేమిస్తున్నా.. ఈ విషయాలను మాత్రం మీ బాయ్ ఫ్రెండ్ కు అస్సలు చెప్పకండి.. లేదంటే?

First Published | Nov 2, 2023, 1:25 PM IST

రిలేషన్ షిప్ సాఫీగా సాగాలంటే ఒకరికొకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలంటుంటారు. ఇది నిజమే. కానీ మన విషయాలు అవతలి వారిని సంతోషపెట్టే విధంగా ఉండాలి. లేదా మీకు మరింత దగ్గర అయ్యే విధంగా ఉండాలి. కానీ మీరు విడిపోయే, మీ మధ్య గొడవలు వచ్చే విధంగా ఉండకూడదు. అందుకే మీరెంత ప్రేమిస్తున్నా.. మీ బాయ్ ఫ్రెండ్ కు కొన్ని విషయాలను అస్సలు చెప్పకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 
 


ఏ రిలేషన్ షిప్ కైనా సరే నమ్మకం, ప్రేమే పునాది. వీటిమీదే మీ రిలేషన్ షిప్ కొనసాగాలా? లేక బ్రేకప్ అవ్వాలా? అనేది ఆధారపడి ఉంటుంది. అయితే రిలేషన్ షిప్ సాఫీగా సాగడానికి మీరు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఈ మధ్యే ప్రేమలో పడితే మీ భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మీ భాగస్వామిని గుడ్డిగా నమ్మేయకండి. చాలా మంది చేసే తప్పు ఇదే. దీనివల్లే కొన్ని బంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి. అందుకే మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మీ విషయాలను వాళ్లతో షేర్ చేసుకోండి. కానీ భవిష్యత్తులో మీకు ఇబ్బందిని కలిగించే విషయాలను మాత్రం అస్సలు చెప్పకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మీ ఎక్స్ గురించి మాట్లాడకండి

మీకు గతంలో ఒక వ్యక్తితో సంబంధం ఉంటే.. అతనితో మీ బంధం పూర్తిగా ముగిసిన తర్వాతే కొత్త సంబంధంలోకి వెళ్లండి. ముఖ్యంగా మీ మాజీ గురించి మీ బాయ్ ఫ్రెండ్ తో పదేపదే మాట్లాడే తప్పు చేయకండి. మీ  బాయ్ ఫ్రెండ్ ముందు మీ మాజీ గురించి ఒకటి రెండు సార్లు మాట్లాడినా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ పదే పదే వారి గురించి మీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ ముందు మాట్లాడితే మీ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. మీ ప్రవర్తన మీ బాయ్ ఫ్రెండ్ కు అస్సలు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా మీరు వారితో ఉంటారో లేదో అన్న డౌట్ కూడా వారిలో మొదలవుతుంది. అందుకే ఇలాంటి తప్పు అస్సలు చేయకండి. 
 

Latest Videos



వ్యక్తిగత సమాచారం వద్దు

ఒకటి రెండు సార్లు కలిసి మాట్లాడినా చాలు అమ్మాయిలు తమ వ్యక్తిగత విషయాలన్నింటిని తమ బాయ్ ఫ్రెండ్స్ తో చెప్పేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదంటారు నిపుణులు. నిజానికి మీరు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని కోరుకుంటారు. ఇందుకోసం కొంత సమయాన్ని తీసుకోండి. అతనిపై పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే మీ పర్సనల్ విషయాలను పంచుకోండి. కానీ మీ భవిష్యత్తును ప్రభావితం చేసే విషయాలను, వివరాలను షేర్ చేసుకోవడం మంచిది కాదు. అంటే మీ సోషల్ మీడియా అకౌంట్, ఫోన్ పాస్వర్డ్ లేదా బ్యాంక్ వివరాలు వంటివి.
 

బలహీనతల గురించి వద్దు 

ప్రతి వ్యక్తికీ కొన్ని బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వీటిని ఎవరితో పడితే వారితో పంచుకోకూడదు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ మాయలో పడి బాయ్ ఫ్రెండ్ తో పంచుకుని ఆ తర్వాత తెగ పశ్చాత్తాపపడుతుంటారు. ఎందుకంటే చాలా సార్లు అబ్బాయిలు వారి బలహీనతలను రిలేషన్ షిప్ లో అస్త్రంగా చేసుకుని వాటిని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఇలాంటి తప్పు మీరు అస్సలు చేయకండి. 

click me!