ఈ రాశులవారు.. తమ భార్యలను మోసం చేస్తారు..!

First Published | Aug 28, 2021, 1:29 PM IST

 అన్ని విధాల సంతృప్తిగా ఉన్నప్పటికీ.. వేరే వారితో  అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు.  తమను నమ్ముకున్నవారిని  మోసం చేస్తుంటారు.

భార్యభర్తలు ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరు.. తాము తమ పార్ట్ నర్ తో సంతోషంగా ఉన్నా.. అన్ని విధాల సంతృప్తిగా ఉన్నప్పటికీ.. వేరే వారితో  అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు.  తమను నమ్ముకున్నవారిని  మోసం చేస్తుంటారు.  తమ పార్ట్ నర్ తమతో ఎంత నమ్మకంగా ఉన్నా.. ప్రేమగా ఉన్నా కూడా మోసం చేస్తుంటారు.  వాళ్లు కావాలని చేయరట.. అలా చేయకుండా ఉండలేరట. మరి ఆ రాశులవారెవరో ఓసారి చూద్దామా..
 

1.మిథున రాశి..

ఈ రాశివారు ఎప్పుడూ రిలేషన్ లోనే ఉండాలని కోరుకుంటారు. వీరితో రిలేషన్ లో ఉన్నవారు.. నిత్యం వీరితోనే ఉండాలని కోరుకుంటారు.  గడియారంలో ముల్లు తిరిగినట్లు నిత్యం వీరితోనే తిరగాలని కోరుకుంటారు. అలా పట్టించుకోకపోతే చాలు.. ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవడానికి రెడీ అయిపోతారు. తమ పార్ట్ నర్ నుంచి ఆశించింది ఏది లభించకపోయినా.. వేరే వారితో అది వెతుక్కోవాలని ఆశపడిపోతారు.
 


2. సింహ రాశి..
ఈ రాశివారు ప్రతిదీ నాటకీయంగా ఉండాలని కోరుకుంటారు. వీరికి అన్ని సమయాల్లో తమ పార్ట్ నర్ దృష్టి పెట్టాలని కోరుకుంటారు.  ఒక్కసారి పట్టించుకోవడం లేదు అనిపిస్తే చాలు.. తమ పార్ట్ నర్ ని చీట్ చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. వేరే వారితో వెంటనే రిలేషన్ లోకి వెళ్లిపోతారు.

3. తుల రాశి..
ఈ రాశివారు శృంగారంలో పెద్ద రసికులు.  అందుకే ఈ రాశివారితో రిలేషన్ లోకి వెళ్లడానికి చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకంటే.. వీరు త్వరగా తమ పార్ట్ నర్ ని మోసం చేయాలని చూస్తుంటారు. పెళ్లి తర్వాత వీరు ఇతరులతో సరసాలు ఆడటం ఆపుతారని కొందరు అనుకుంటారు కానీ.. అలా జరగదట. పెళ్లి తర్వాత కూడా వీరు తమ పార్ట్ నర్ ని చీట్ చేయాలని చూస్తుంటారట.

4.కుంభ రాశి..
ఈ రాశివారు తమ పార్ట్ నర్ ని మోసం చేస్తారు. కానీ.. శారీరక సంబంధాలు మాత్రం పెట్టుకోరు. కేవలం తమ పాత లవర్ కి మెసేజ్ లు చేయడం , లేదా ఎవరినైనా ఫ్లర్ట్ చేయడం లాంటివి మాత్రం చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒకరకమైన చీటింగ్ అని గుర్తించాలి. వీరు చేస్తున్న చీటింగ్ విషయం పార్ట్ నర్ కి తెలిస్తే.. ఇక జీవితంలో సంతోషంగా ఉండలేరు.

5.మీన రాశి..

నమ్మసక్యంగా లేకపోయినా.. ఈ రాశివారు.. తమ పార్ట్ నర్ ని మోసం చేసే అవకాశం చాలా ఎక్కువ. వీరికి ఎమోషన్స్ ఎక్కువ. మూడ్ స్వింగ్స్ వెంట వెంటనే మారుతూ ఉంటాయి. కాబట్టి.. ఆ మూడ్ ని బట్టి.. వేరే వారికి దగ్గరయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.,

Latest Videos

click me!