భర్త ఆవేదన.. శృంగారానికి ఆసక్తి చూపని భార్య..!

First Published | Aug 20, 2021, 2:41 PM IST

మహిళలు ఏదైనా తప్పు చేసినప్పుడు.. భర్తను దూరం పెడుతూ ఉంటారట. లేదంటే.. మీరు ఏదైనా వారి నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు.. కూడా వాళ్లు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. 

తామకు ఎంత ఆసక్తిగా ఉన్నా.. ఎంత చొరవ చూపించినా.. సెక్స్ విషయంలో తమ భార్యలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని చాలా మంది భర్తలు ఫిర్యాదు చేస్తూ ఉంటారు

అయితే.. అలా భార్యలు సెక్స్ పట్ల ఆసక్తి చూపించకపోవడానికి చాలానే కారణాలు ఉంటాయట. అయితే.. ఆ విషయాన్ని వారు డైరెక్ట్ గా చెప్పకుండా.. ఇన్ డైరెక్ట్ గా చెబుతారట. వాళ్లు ఏ కారణాలతో భర్తను దూరం పెడతారు..? అలా చేయడానికి కారణాలేంటో నిపుణులు చెబుతున్నారు.

Latest Videos


sexభార్యభర్తల మధ్య శృంగార బంధం బలంగా ఉండాలి అంటే.. వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆ ఎమోషనల్ బాండింగ్ లేనప్పుడు  ఇలానే.. భార్యలు సెక్స్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించరట. కాబట్టి.. భార్యతో సన్నిహితంగా ఉండాలి. ఆమె మనసులో బాధను తీర్చడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయట.

మహిళలు ఏదైనా తప్పు చేసినప్పుడు.. భర్తను దూరం పెడుతూ ఉంటారట. లేదంటే.. మీరు ఏదైనా వారి నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు.. కూడా వాళ్లు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. అలా తప్పుని మీరు సరిద్దుకున్నప్పుడే వారు మళ్లీ మీకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.

కొందరు మహిళలు ఇంటి పనీ, ఆఫీసు పని.. ఇలా అన్నింటి పనులతో అలసిపోతారు. ఏ మాత్రం ప్రోత్సాహం దొరకక.. పని ఒత్తిడిలో మునిగిపోయి.. శరీరం పూర్తిగా అలసిపోవడంతో.. కూడా శారీరక కలియకకు ఆసక్తి చూపించరట. కాబట్టి.. భార్య చేస్తున్న పనిని గుర్తించి.. ఆమెకు కాస్త తోడుగా నిలపడాలి. అప్పుడు ఆమె మీ శారీరిక కోరికలను కూడా గుర్తిస్తుంది.

వయసులో ఉన్నవారికే సిగ్గు ఎక్కువగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో మార్పులు వచ్చినట్లు.. వారి ప్రవర్తనలోనూ మార్పులు వస్తూ ఉంటాయట. వాటి కారణంగా కూడా.. వారి శరీరాన్ని భర్త ముందు ఉంచడానికి కొందరు మహిళలు సిగ్గుపడతారట. దాని వల్లే వారు సెక్స్ కి దూరం పెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఏవైనా సమస్యలు, అత్తగారి వేధింపులు లాంటివి ఎదుర్కొనేవారు కూడా.. భర్తతో సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించరట. కాబట్టి.. ముందుగా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు.

click me!