ఇలా చేస్తే విడాకులు అన్న మాటే రాదు.. విడిపోవడానికి ప్రధాన కారణమే ఇది..!

First Published | Aug 25, 2021, 2:25 PM IST

నమ్మసక్యంగా లేకపోయినా.. ఎక్కువ మంది దంపతులు విడిపోవడానికి ప్రధాన కారణం.. ఒకరికి మరొకరు మర్యాద ఇవ్వకపోవడమేనట. ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవించడం..  కచ్చితంగా అలవాటు చేసుకోవాలి

ప్రతి బంధంలోనూ ఏవో ఒక అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా దాంపత్య బంధంలో.. ఎలాంటి అడ్డంకులు.. మాట పట్టింపులు లేకుండా.. ఆ బంధం కొనసాగదు. అయితే.. వచ్చిన అడ్డంకులను ఎలా దాటగలుగుతున్నారనే విషయంలోనే ఆ బంధం గొప్పతనం తెలుస్తుంది.

తెలివిగా సమస్యలను పరిష్కరించుకున్నవారి భవిష్యత్తు అందంగా ఉంటుంది. అలా కాకుండా...సమస్యలను పెంచుకుంటూ వెళ్లేవారు చివరకు విడిపోయేదాకా వెళ్తుంది. అలా కాకుండా.. బంధం బలంగా ఉండి.. ఆనందంగా సాగాలంటే.. దంపతులు ఈ సలహాలు ఫాలో అయితే చాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Latest Videos


మనిషి  సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.  అయితే.. మిమ్మల్ని సంతోషపెట్టాల్సిన బాధ్యత మీ పార్ట్ నర్ మీదే ఉంటుందనే భావన నుంచి బయటపడాలి. మీకు మీరుగా సంతోషంగా ఉండటానికి అలవాటు పడాలి. మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే.. ఎవరూ బాధపెట్టలేరు. కాబట్టి.. ఆ భావన తొలగించుకుంటే.. దంపతుల మధ్య ముందు ఎలాంటి సమస్య రాదు.

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలం. అలానే. ఓ బంధం నిలపడాలంటే.. ఇద్దరి ప్రయత్నం ఉండాలి. వివాహ బంధం బలంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఎప్పుడూ ఒకవైపే ఉండకూడదు. ఇరువైపులా ఉండాలి. మీ మనసులోని విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అందుకోసం సహనం పెంచుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కేవలం ఒక్కరు మాత్రమే మాట్లాడితే అది కమ్యూనికేషన్ అవ్వదు. నిరాశ, అపార్థాలు చోటుచేసుకుంటాయి.

నమ్మసక్యంగా లేకపోయినా.. ఎక్కువ మంది దంపతులు విడిపోవడానికి ప్రధాన కారణం.. ఒకరికి మరొకరు మర్యాద ఇవ్వకపోవడమేనట. ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవించడం..  కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే.. వారిద్దరి మధ్య బంధం ఆనందంగా సాగుతుంది. ఒకరి నిర్ణయాలను మరొకరు ఎప్పుడూ అగౌరపరచకూడదు.

పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. వారి ప్రతి విషయంలో మీ జోక్యం ఉండాల్సిన అవసరం లేదు. అన్నీ చెప్పి చేయాలి అంటే కుదరదు. కొన్ని చిన్న చిన్న వాటిని ఎవరికి స్వతంత్రంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా చేసుకోవచ్చు. దంపతుల మధ్య కూడా కొన్ని బౌండరీలు ఉంటాయనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ఇక ప్రతి ఒక్కరి బంధం ఒకేలా ఉంటుందనే గ్యారెంటీ ఉండదు. ఒక్కొక్కరి బంధం ఒక్కోలా ఉంటుంది. అయితే.. ప్రతి ఒక్కరి బంధంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు మీ పార్ట్ నర్ కి మధ్య ఉన్న లవ్ లాగ్వేంజ్ ని మీరు గుర్తించాల్సి ఉంటుంది.

అది కనుక తెలిస్తే.. మీ బంధం ఎప్పుడూ కలకాలం ఆనందంగా ఉంటుంది.  ఒకరికొకరు అన్ని వేళలా తోడు ఉంటామనే నమ్మకం కలిగించాలి.

ఇక వారానికి ఒకసారైనా దంపతులు తమ పార్ట్ నర్ కి స్పెషల్ గా సమయం కేటాయించాలి. షాపింగ్ కి వెళ్లడం.. డిన్నర్ లేదా... సినిమా ఇలా ఏదో ఒక సరదా ఉండాలి. అప్పుడు ఏవైనా టెన్షన్లు ఉంటే తగ్గుతాయి. 

click me!